
న్యాయం చేయండి సారూ!
తమ సమస్యలను పరిష్కరించండి సారూ..!
అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన
అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, డీఆర్‌వో మోహన్‌కుమార్ ఇతర
అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 364 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు.
– చిత్తూరు కలెక్టరేట్