
పంట పొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని కొమ్మిరెడ్డిగారిపల్లెలో సోమవారం తెల్లవారు జామున ఏనుగులు పంట పొలాలపై పడి ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. మళ్లీ ఏనుగులు ఇదే మండలంలో తిష్ట వేసి పంటలను రోజూ నాశనం చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఏడాది కాలంగా ఇక్కడే ఉంటూ రైతులు సాగు చేసిన పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నా యి. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయోనని రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొమ్మిరెడ్డి గారిపల్లెవద్ద సోమ వారం అమరనాథరెడ్డి పొలంలో వరి, అరటి పంటలను తొక్కి నాశనం చేశాయి.
ఏనుగులు తొక్కేసిన అరటి పంట
కొమ్మిరెడ్డిగారిపల్లె వద్ద దెబ్బతిన్న వరిపంట

పంట పొలాలపై ఏనుగుల దాడి