
● దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ● బంధువుల రోద
పుత్తూరు : కై లాసవాసా ఉన్నెపాత్తదానే వందారు.. కై విట్టియే సామి అంటూ పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. బుధవారం సాయంత్రం స్థానిక బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తమిళనాడు పళ్లిపట్టు తాలుకా పొద్దటూరుపేటకు చెందిన మూర్తి (58), సుబ్రమణ్యం(56) అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఐ ఓబయ్య కథనం మేరకు.. పొద్దటూరుపేటకు చెందిన పవర్‌లూమ్స్ కార్మికులైన మూర్తి, సుబ్రమణ్యం ఇద్దరు బుధవారం ఉదయం బైక్‌పై శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొన్నారు. తిరుగు ప్రయాణంలో పుత్తూరు బైపాస్ రోడ్డులో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలను పరిశీలించి వాహనాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మూర్తికి నలుగురు పిల్లలు కాగా, సుబ్రమణ్యానికి ముగ్గురు పిల్లలు అందరికీ వివాహాలు అయ్యాయి.

● దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ● బంధువుల రోద