అవస్థల పింఛన్‌ | - | Sakshi
Sakshi News home page

అవస్థల పింఛన్‌

Oct 2 2025 8:25 AM | Updated on Oct 2 2025 8:25 AM

అవస్థ

అవస్థల పింఛన్‌

పండుటాకులకు ఉదయాన్నే అందని పింఛన్‌ సొమ్ము ఉదయం 11 గంటల వరకు ప్రారంభం కాని పంపిణీ వాలంటీర్‌ విధులు చేయలేమంటూ సచివాలయ ఉద్యోగుల నిరసన సచివాలయాల వద్ద క్యూ కట్టిన వృద్ధులు పింఛన్‌ సొమ్ము కోసం గంటల తరబడి నిరీక్షణ

జిల్లా సమాచారం

గ్రామ సచివాలయాలు 504

వార్డు సచివాలయాలు 108

రూరల్‌లోని కుటుంబాలు 1,65,970

అర్బన్‌లోని కుటుంబాలు 1,01,121

గత నెల సెప్టెంబర్‌లో

అందజేసిన పింఛన్లు 2,69,812

ప్రస్తుత నెల అక్టోబర్‌లో

అందజేసిన పింఛన్లు 2,68,307

తొలగించిన పింఛన్లు 15,495

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లు పొందేందుకు పండుటాకులు అవస్థలు పడుతున్నారు. ప్రతి నెలా ఏదో ఒక సమస్యతో వృద్ధులకు సకాలంలో పింఛన్లు అందని దుస్థితి. తాజాగా సచివాలయ ఉద్యోగులు వాలంటీర్‌ విధులు తాము చేయలేమంటూ నిరసన చేపట్టారు. దీంతో ఈనెల 1వ తేదీన జిల్లా వ్యాప్తంగా వేకువజామునే వృద్ధులకు అందాల్సిన సామాజిక పింఛన్లు ఉదయం 11 గంటల వరకు మొదలవ్వని పరిస్థితి. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందని ఇంటింటీకి వెళ్లి పింఛన్లు తాము అందజేయలేమని నిరసనకు దిగారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అక్టోబర్‌ నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియ కోతలతో పాటు అవస్థల నడుమ కొనసాగింది.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా రూరల్‌లో 504, అర్బన్‌లో 108 మొత్తం 612 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. సచివాలయాల పరిధిలోని పింఛన్‌ లబ్ధిదారులకు గత ఐదేళ్లల్లో ప్రతి నెలా ఒకటవ తేదీన వేకువజామునే పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారు. దీంతో కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు సేవలందించే వాలంటీర్లు కనుమరుగయ్యారు. వాలంటీర్‌ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడటంతో వారి విధులు సచివాలయ ఉద్యోగులతో చేయించడం మొదలుపెట్టారు. గత ఒకటిన్నర సంవత్సరంగా సచివాలయ ఉద్యోగులు అదనపు విధులు నిర్వహిస్తూనే వచ్చారు. ఓపికతో ఎంత ఒత్తిడి ఉన్నా అదనపు బాధ్యతలను చేస్తున్న సచివాలయ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయడం మొదలుపెట్టింది. దీంతో అధిక ఒత్తిడికి తట్టుకోలేని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.

మెరుపు నిరసన

సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. తాము వాలంటీర్లు కాదని, కష్టపడి ఉన్నత విద్య చదివి పోటీ పరీక్షలు రాసి సచివాలయ ఉద్యోగాలు సాధించామని తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వాలంటీర్ల విధులు తాము చేయమంటూ అక్టోబర్‌ 1న జిల్లా వ్యాప్తంగా సకాలంలో పింఛన్ల పంపిణీ చేయకుండా నిరసన చేపట్టారు.

గందరగోళంగా పంపిణీ

జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ గందరగోళంగా కొనసాగింది. సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు వల్ల వేకువజామున పంపిణీ కావాల్సిన పింఛన్ల పంపిణీ ఉదయం 11 గంటల వరకు ప్రారంభం కాని దుస్థితి. వేకువజామునే పింఛన్‌ సొమ్ము కోసం నిరీక్షించే వృద్ధులు సచివాలయాల వద్దకు పరుగులు తీశారు. ఇంటింటి పింఛన్ల పంపిణీ జరగకపోవడంతో వృద్ధులు అధిక సంఖ్యలో సచివాలయాల వద్ద క్యూ కట్టారు. నిలబడేందుకు ఒంట్లో సత్తువ లేకున్నా గంటల తరబడి నిలబడి పింఛన్‌ సొమ్మును తీసుకున్నారు. అసలే నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు చిత్తూరు నగరంలోని 28, 30 వార్డుల సచివాలయాల మెట్లు ఎక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని సచివాలయాల వద్ద ఉదయం 10 గంటలు అవుతున్నా సచివాలయ ఉద్యోగులు రాకపోయే సరికి పింఛన్ల కోసం పడిగాపులు కాశారు.

1,505 పింఛన్ల తొలగింపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలకు పైగా అవుతోంది. ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేయలేదు. కొత్త పింఛన్ల కోసం ప్రతి సోమ వారం వృద్ధులు పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇస్తూనే ఉన్నా రు. ఆ అర్జీలను అధికారులు స్వీకరించి బుట్టదాఖలు చేస్తున్నారే తప్ప కొత్త పింఛనన్లు ఇవ్వని పరిస్థితి. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ప్రతి నెలా ఏదో ఒక కారణంతో కూటమి ప్రభుత్వం ఉన్న పింఛన్‌లలో కోత విధిస్తోంది. తాజాగా అక్టోబర్‌ నెల పింఛన్లలో 1,505 పింఛన్లు తొలగించారు. గత నెల సెప్టెంబర్‌లో జిల్లా వ్యాప్తంగా 2,69,812 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికా రులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అక్టోబర్‌ నెల లో 2,68,307 మందికి పింఛన్ల నగదు మంజూరు అ యినట్లు తెలిపారు. కాగా మంజూరు అయిన వారిలో 2,68,307 మందికి గాను 2,52,812 మందికి బుధవా రం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేశారు. మి గిలిన 15,495 మందికి సరఫరా చేయలేక విఫలమ య్యారు. ప్రతి నెలా ఏదో ఒకసాకుతో పింఛన్ల కోత విధిస్తున్న ప్రభుత్వంపై పింఛన్‌ లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు.

చిత్తూరు : 28వ వార్డు సచివాలయంలో పింఛన్లు అందజేస్తున్న ఉద్యోగులు

నడవలేని స్థితిలో ఉన్న తల్లిని సచివాలయం

వద్దకు తీసుకొచ్చి పింఛన్‌ తీసుకెళ్తున్న దృశ్యం

28వ డివిజన్‌ సచివాలయం వద్ద రోడ్డులో నిలబడి పింఛన్లు అందజేస్తున్న దృశ్యం

అవస్థల పింఛన్‌1
1/4

అవస్థల పింఛన్‌

అవస్థల పింఛన్‌2
2/4

అవస్థల పింఛన్‌

అవస్థల పింఛన్‌3
3/4

అవస్థల పింఛన్‌

అవస్థల పింఛన్‌4
4/4

అవస్థల పింఛన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement