
కలెక్టర్ ఆరా..
వెదురుకుప్పం: మండలంలో దారుణం చోటు చేసుకుంది. దళితుల ఆశాజ్యోతి, బడుగు, బలహీన వర్గాల పెన్నిధి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం కలకలం రేగింది. అగ్రవర్ణ దురహంకారులను అరెస్ట్ చేయాలంటూ దళిత వర్గాలు నిరసనకు దిగాయి.
అసలేం జరిగిందంటే!
దేవళంపేటలో స్థానిక సర్పంచ్ గోవిందయ్య 2023లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేవళంపేట–తిరుపతి ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలంలో విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ స్థలాన్ని స్థానికంగా కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్ప ట్లోనే పరోక్షంగా సర్పంచ్ గోవిందయ్యపై కొందరు టీడీపీ నేతలు భగ్గుమన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని టీడీపీ నేత సతీష్ నాయుడు కులం పేరుతో దూషించారు. అధికారం రావడంతో సర్పంచ్‌పై జిల్లా అధికారులకు ఫిర్యా దు చేసి చెక్ పవర్‌ను రద్దు చేయించారు. అంతటితో ఆగకుండా సర్పంచ్‌పై పలు కేసులు పెట్టించి వేధించారు. వాటన్నిటికీ వెరవకుండా వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన సతీష్ నాయుడు, అతని అనుచరులు కలిసి అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టేందుకు పూనుకున్నారు. ఉలిక్కిపడ్డ దళితులు
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అంబేడ్కర్ విగ్రహంపై పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా దళితులు ఉలిక్కిపడ్డారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఏకమయ్యారు. అగ్రవర్ణ దురహంకారుల దుశ్చర్యను ఖండించాయి. రేపు మమ్మల్ని ఏం చేస్తారోనని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
కాళ్లు పట్టుకుంటాం.. న్యాయం చేయండి
మీ కాళ్లు పట్టుకుంటాం.. ఇక మమ్మల్ని బతకనివ్వరు.. మాకు న్యాయం చేయండంటూ సర్పంచ్ గోవిందయ్య ఏకంగా నగరి డీఎస్పీ మహ్మద్‌అజీజ్ కాళ్లు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జి కృపాలక్ష్మి వెదురుకుప్పం పోలీసు స్టేషన్‌లో కలిసి.. పోలీసుల వైఫల్యం, వారి తీరును ఎండగట్టారు. వారి నిర్లక్ష్యంతోనే నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరుగుతన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బందార్లపల్లె ఘటనను గుర్తుచేశారు. బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ భాస్కర్‌కు జరిగిన అవమానాన్ని గుర్తుచేసి న్యాయం చేయాలని కోరారు. ఈనెల 25లోపు నిందితులను పట్టుకుని శిక్షించాలని సూచించారు.
కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యేల ఆరా
వారిని అరెస్టు చేయాలి
కార్వేటినగరం: రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన అగ్రవర్ణ దురహంకారులను అరెస్టు చేయాలని శుక్రవారం కార్వేటినగరం గాండ్లమిట్ట కూడలిలో దళిత నాయకులు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అంబేడ్కర్ కీర్తి ప్రతిష్టలను కొనియాడుతుంటే, దళిత నియోజకవర్గంలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేయడం హేయమైన చర్య అన్నారు. అగ్రవర్ణ దురహంకారులను రాజకీయాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలన్నారు. దళితవర్గ ఆశాజ్యోతి అంబేడ్కర్‌కు జరిగిన అవమానానికి దేశ వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడ బోమని హెచ్చరించారు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం భారత రాజ్యాంగానికి నిప్పు పెట్టినట్టేనన్నారు. దళిత దేవుడ్ని కించపరిస్తే దళితజాతి ఊరుకోబోదన్నారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ క్రమంలో పుత్తూరు, చిత్తూరు జాతీయ రహదారిపై వాహనాలు భారీ స్థాయిలో స్తంభించాయి. దళిత ఉద్యోగ నాయకులు చలపతిరావు, వెంకటేష్, దొరబాబు, వేమయ్య, రామూర్తి, నాగభూషణం, రవి, గంగాధరం, భాస్కర్, కొత్త పల్లి సుబ్రమణ్యం, సోము, దొరబాబు, శేషాద్రి, కిరణ్, పాపయ్య పాల్గొన్నారు. అలాగే మండలంలోని గోపిఽశెట్టిపల్లిలో కూడా దళిత నాయకులు ఎంపీటీసీ మురగయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.