
లేదా కనువిప్పు!
ఆత్మగౌరవానికి నిప్పు..
దళితులకు అండగా వైఎస్సార్‌సీపీ
బానిస బతుకుల నుంచి విముక్తికి పోరాటం చేయడమే ఆయన చేసిన తప్పా...? పేద వాడు అందరితో పాటు సమానంగా తలెత్తుకు తిరాగాలనుకోవడమే ఆయనకు శాపంగా మారిందా...? సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్షే ఆయన చేసిన నేరమా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళలకు తీసుకొచ్చిన రిజర్వేషన్ ఆ మహనీయుని పాలిట శత్రువైందా..?అంటే కూటమి పాలనలో అవుననే సమాధానం వస్తోంది. కూటమి కొలువుదీరినప్పటి నుంచీ అడుగడుగునా అవమానమే ఎదురవుతోంది. దళితుల ఆశాజ్యోతి అంబేడ్కర్ విగ్రహాలకు నిప్పు పెట్టడం... చెప్పుల దండలు వేసి అవమానించడం రివాజుగా మారుతోంది. తమ ఆత్మగౌరవానికి నిప్పు పెడుతుంటే.. అధికారులు, నేతలకు కనువిప్పు లేదా..? అంటూ దళిత వర్గాలు మండిపడుతున్నాయి. వెదురుకుప్పం మండలం, దేవళంపేట ఘటనను తీవ్రంగా ఖండించాయి. శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి.