ఆ మృగాళ్లపై ఎన్నో అనుమానాలు! | - | Sakshi
Sakshi News home page

ఆ మృగాళ్లపై ఎన్నో అనుమానాలు!

Oct 4 2025 1:57 AM | Updated on Oct 4 2025 1:57 AM

ఆ మృగ

ఆ మృగాళ్లపై ఎన్నో అనుమానాలు!

● చిత్తూరు గ్యాంగ్‌రేప్‌ ఘటనలో కీలకంగా వీడియోలు ● పలుచోట్ల ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డట్లు అనుమానాలు ● పార్కుల్లో ఏకాంత వీడియోలు.. ఆపై అఘాయిత్యాలే ప్రవృత్తి ● జిల్లా కేంద్రంలో వరుస ఘటనల కలకలం.. కొరవడిన నిఘా

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో ఓ మైనర్‌ బాలికపై జరిగిన సామూహిత లైంగికదాడి ఘటనలో పట్టుబడ్డ నిందితుల తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలు జిల్లా కేంద్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. చైన్‌ స్నాచింగ్‌లు, దోపిడీలు పోలీ సు శాఖ పనితీరును ప్రశ్నిస్తోంది. ఉన్న స్టేషన్లలో పోస్టింగులు కాపాడుకోవడానికి చూపుతున్న విశ్వాసం.. ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం కలిగిద్దామనే ఆలోచన కొందరు ఖాకీల్లో కనిపించడం లేదు. మరోవైపు సామూహిత లైంగికదాడి ఘటనలో నిందితుల వద్ద లభించిన వీడియోలన్నీ కూడా అటవీశాఖకు చెందిన నగరవనంలోవే కావడం.. ఫారెస్టు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.

వీడియోల్లో ఏముందంటే?

నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎం.మహేష్‌, పి.కిషోర్‌, జె.హేమంత్‌ వద్ద మొబైల్‌ఫోన్లు సీజ్‌ చేసిట్లు తెలిపారు. ఇందులో పలువురు ప్రేమికులు, స్నేహితులు సన్నితంగా ఉండే వీడియోలు గుర్తించామన్నారు. దీని ప్రకారం నిందితులు ముగ్గురూ కరుడుగట్టిన మృగాలని అర్థమవుతోంది. చిత్తూరు–తిరుపతి రోడ్డులోని అటవీశాఖకు చెందిన నగరవనంపై ఈ ముగ్గురికీ పూర్తిగా పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. పార్కులోపలకు వచ్చే ప్రేమజంటలు, స్నేహితులు, దంపతులను ఫాలో అవుతూ వెళ్లడం.. వాళ్లు సన్నిహితంగా ఉండే వీడియోలు తీయడం అలవాటుగా మారింది. ఆపై వీడియోలను చూపించడంతో ‘వీటిని మా ఇంట్లో చూపిస్తే నన్ను చంపేస్తారు. మీ కేం కావాలి..’ అని అడిగితే అక్కడికక్కడే వాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేసి అఘాయిత్యాలకు పాల్పడడం, కొందరి నుంచి డబ్బు, నగలు దోచుకోవడం ప్రవృత్తిగా మార్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. చాలామంది బాధితులు విష యం బటయకు చెబితే పరువుపోతుందని, పెద్దలు చదువు మాన్పిస్తారని, పనులకు పంపరని ఎక్కడా కూడా చెప్పుకోలేదు. మైనర్‌బాలికపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి రావడంతో, ముగ్గురు నిందితులపై మరికొన్ని ఫిర్యాదులు రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా నిందితులకు వ్యతిరేకంగా ఫోరెన్సిక్‌, ఫింగర్‌ప్రింట్‌, సాంకేతికపరమైన కీలక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు.. నేర నిరూపణకు బలమైన డాక్యుమెంటేషన్‌ సిద్ధం చేసిన ట్లు సమాచారం.

ఖాకీల పనితీరు ప్రశ్నార్థకం!

చిత్తూరులో ఇటీవల జరుగుతున్న పలు ఘటనలు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం, ఆభరణాలు సీజ్‌ చేయడం వరకు హర్షించదగ్గ విషయమే. కానీ ఇదే సమయంలో నేరం జరగకుండా ఆపాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉందనే విషయాన్ని ఖాకీలు మరచిపోతున్నారు. వేలూరు రోడ్డులోని ఫారెస్టు వద్ద ప్రేమ జంటలు, స్నేహితులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డ అఖిల్‌ ఘటన కూడా నెలల తరబడి బయటకు వచ్చింది. ఇలాంటి ఘటనలు పోలీసు నిఘా, పట్రోలింగ్‌ చేసే పద్ధతులను ప్రశ్నిస్తోంది. పట్టపగలు, మధ్యాహ్నం వేళల్లో కూడా ఈ తరహా ఘటనలను నియంత్రించడం పోలీసులకు చేతగాలేదనే చెప్పాలి. కొందరు ఖాకీలు పేకాట క్లబ్బు లు, లాటరీ నిర్వాహకులు, పంచాయితీల ద్వారా పొందే ఆర్థిక వనరులపైనే మక్కువ చూపిస్తున్నారు. పోస్టింగులు కాపాడుకోవడానికి అధికార పార్టీ నేతలు చెప్పినవాళ్లను వదిలేయడం, ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారనే అపవాదు ఉంది.

నిఘా పెంచుతాం

చిత్తూరులో ఇటీవల జరిగిన ఘటనల్లో పోలీసుశాఖపై బాధ్యత పెంచింది. నేర నియంత్రణలో బీట్లను పెంచడం, పట్రోలింగ్‌ పటిష్టం చేయడంపై దృష్టి పెడతాం. లైంగికదాడి ఘటనలో అటవీశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఎస్పీతో మాట్లాడి ఫారెస్టు వాళ్లపై చర్యలకు సిఫార్సు చేసే విషయాన్ని పరిశీలిస్తాం. జరిగిన ఘటనలు మాకు కేసే తప్ప.. రాజకీయకోణం కాదు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి అఘాయిత్యాలు జరిగి ఉంటే పోలీసులకు చెప్పండి. మీ వివరాలు మేము బహిర్గతం చేయం. – సాయినాథ్‌, డీఎస్పీ, చిత్తూరు

ఆ మృగాళ్లపై ఎన్నో అనుమానాలు! 1
1/2

ఆ మృగాళ్లపై ఎన్నో అనుమానాలు!

ఆ మృగాళ్లపై ఎన్నో అనుమానాలు! 2
2/2

ఆ మృగాళ్లపై ఎన్నో అనుమానాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement