
పంట పొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని మతుకువారిపల్లె, మేకలవారిపల్లె పంచాయతీల్లో ఏనుగులు గురువారం తెల్లవారు జామున పంట పొలాలపై దాడిచేశాయి. మతుకువారిపల్లెలో రాజారెడ్డి, రవిరెడ్డి పొలంలో వరి పంటను తొక్కిపడేశాయి. మేకలవారిపల్లెలో మల్లికార్జు న పొలంలో సాగులో ఉన్న టమాట పంటను ధ్వంసం చేశాయి. ఫారెస్టు అధికారులు ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను పరిశీలించారు.
నియామకం
చిత్తూరు అర్బన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నుంచి స్టేట్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సభ్యులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పూతలపట్టు నుంచి లలితకుమారి, కుప్పం నుంచి సెంథిల్‌కుమార్, పలమనేరు నుంచి సీ.వీ.కుమార్ నియమితులైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శిక్షణ ప్రారంభం
చిత్తూరు అర్బన్: డీఎస్సీ 2025లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎంపికై న ఉపాధ్యాయులకు శుక్రవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ కౌన్సెలింగ్‌లో ఉపాధ్యాయులుగా నియామక ఉత్తర్వులు అందుకున్న టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,407 మందికి గాను 1,398 మంది హాజరు కాగా, తొమ్మిది మంది గైర్హాజయ్యారు. చిత్తూరులోని ఆర్‌కే పాఠశాలలో 118 మంది, ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో 150 మంది.. తిరుపతి కేంద్రంగా నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 211 మంది, విశ్వం స్కూల్లో 249 మంది, మెడ్‌జీ స్కూల్లో 449 మంది, ఆదిశంకర ఇంజినీరింగ్ కాళాశాలలో 221 మంది హాజరయ్యారు. చిత్తూరులో డీఈవో వరలక్ష్మి, తిరుపతిలో డీఈవో కేవీఎన్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో సమగ్రశిక్ష ఏపీసీల సహకారంతో కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

పంట పొలాలపై ఏనుగుల దాడి