
జనసేన జెండాను పీకి పడేసిన టీడీపీ నేత
పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీలో ఆవిష్కరించిన జనసేన జెండాను టీడీపీ చోటా నాయకుడు నవీన్ చౌదరి బుధవారం జనసేన జెండాను పీకి ముళ్లపొదల్లో పడేశాడు. వనదుర్గాపురంలో ప్రాథమిక పాఠశాల ఎదుట దిమ్మెలు కట్టి జనసేన, టీడీపీ జెండాలు ఆవిష్కరించారు. కొన్ని రోజులు తరువాత టీడీపీ జెండా లేకుండా పోయింది. అయితే జనసేన పార్టీ జెండా మాత్రమే ఉంది. దీన్ని గమనించిన టీడీపీ నాయకుడు జెండా ఎగుర వేయడానికి ఉంచిన పైపును పడగొట్టి పై నున్న జెండాను చుట్టి ముళ్లపొదల్లో విసిరేశాడు. రోడ్డు పనులు ప్రారంభోత్సవానికి వచ్చిన జనసేన పార్టీ యువకులు ముళ్లపొదల్లో ఉన్న పైప్ జెండాను చూశారు. దీంతో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం ముదిరి తీవ్ర స్థాయికి చేరింది.
ముళ్లపొదల్లో పడేసిన జనసేన జెండా, విరిచేసిన జెండా పైప్

జనసేన జెండాను పీకి పడేసిన టీడీపీ నేత