
మనోరథం తీరేలా.. కల్కి కటాక్షం
న్యూస్‌రీల్
అంగరంగ వైభవంగాశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రథంపై ఊరేగిన దేవదేవేరులు అశ్వవాహనంపై విహరించిన శ్రీమలయప్పస్వామివారు నేడు చక్రస్నానం.. ధ్వజావరోహణం
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
బ్రహ్మోత్సవ వేళ.. బ్రహ్మాండనాయకుని దర్శించిన వారిది కదా భాగ్యము.. భువి వైకుంఠంలో అడుగిడిన వారిది కదా పుణ్యము.. ఆనందనిలయంలో దేవదేవుని కనులారా కాంచిన వారి జన్మము కదా ధన్యము.. మహిమాన్విత రథంపై మాడవీధుల్లో ఊరేగుతున్న శ్రీమలయప్పస్వామివారిని సేవించిన వారు కదా పునీతము.. గోవింద నామస్మరణతో పులకించిన వారిది కదా ముక్తిమార్గము.. అశ్వవాహనంపై కల్కి అవతారంలో విహరిస్తున్న అలంకారప్రియుని కటాక్షం పొందిన వారి జీవితము కదా చరితార్థము.
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం శ్రీమలయప్పస్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో కూడిన వైకుంఠనాథుడు చతుర్మాడ వీధుల్లో రథంపై ఊరేగారు. శ్రీనివాసుని దివ్యదర్శనంతో భక్తులు పులకించారు. రథోత్సవంలో దేవదేవుడిని సేవించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అశేష భక్తజనులు గోవిందనామస్మరణల నడుమ మహారథం లాగుతూ తన్మయత్వం చెందారు. రాత్రి అశ్వవాహనంపై మలయప్పస్వామివారు కల్కి అవతారంలో విహరించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు.

మనోరథం తీరేలా.. కల్కి కటాక్షం

మనోరథం తీరేలా.. కల్కి కటాక్షం