
మహిషాసురమర్ధినిగా బోయకొండ గంగమ్మ
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని బుధవారం శత్రు సంహారి మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. ఉగ్రరూపం దాల్చుతూ సింహంపై నిలువరించి ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలం, గదను ఎత్తుకొని శత్రువుని సంహరిస్తూ ఉన్నవిధంగా అర్చకులు అలంకరించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలతో ముస్తాబుచేశారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో వేద పండితులు గోవర్థనశర్మ అర్చక బృందం అభిషేకాలు, అర్చనలు, గణపతి హోమం, చంఢీహోమంతో పాటు పూర్ణాహుతి చేశారు.

మహిషాసురమర్ధినిగా బోయకొండ గంగమ్మ