
కోర్టు తీర్పు కూటమికి చెంప పెట్టు
న్యూస్‌రీల్
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వైద్యవిద్య దూరం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు భారీగా నష్టం పీ–4 విధానంతో.. రాష్ట్రంలో మళ్లీ బానిసత్వం ‘బాబు’ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం చిత్తూరులో అంబేడ్కర్ విగ్రహానికి విన్నవించిన వైనం
మద్యం కుంభకోణం అంటూ కక్షసాధింపులకు పాల్పడిన కూటమికి కోర్టు తీర్పు చెంప పెట్టని మాజీ డెప్యూటీ సీఎం పేర్కొన్నారు.
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
‘పేద, మధ్యతరగతి పిల్లలు పెద్దపెద్ద చదువులు చదవాలి. డాక్టర్లు, ఇంజినీర్లుగా రాణించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మించింది. ఇందులో ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా పూర్తిచేసింది. ఇంతలో ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. వెంటనే ప్రయివేటీకరణ ఆపాలి.. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చిచెప్పారు. మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై ఆందోళనలు మిన్నంటించారు.
అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
బాబూ..
ప్రయివేటీకరణ ఆపు!
చిత్తూరు అర్బన్: ‘పేద, మధ్యతరగతి ప్రజల కోసం నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం. పేద విద్యార్థుల భవిష్యత్తుపై ఇది గొడ్డలిపెట్టు లాంటిది’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి దుశ్చర్య జరగలేదని దుయ్యబట్టా రు. కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం చిత్తూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని దర్గా కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి, వినతి పత్రం అందచేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు పార్టీ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డి, పూతలపట్టు సమన్వయకర్త డా.సునీల్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారితో పాటు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏ అర్హతతో ధారాదత్తం చేస్తున్నారు
రాజ్యాంగాన్ని అవమానిస్తోంది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలు, పేదలు లక్ష్యంగా కుట్రలు పన్నుతోంది. రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంకుని వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలు తీసుకొస్తే.. చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేయడం దారుణం. ఎస్సీ, ఎస్టీలకు విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా కల్పించిన అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది. పేద విద్యార్థులను వైద్యవిద్యకు దూరం చేస్తోంది.
– పీవీ.గాయత్రీదేవి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి.
హక్కులు లాక్కున్నారు..
అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నారు. పేదలు వైద్య విద్య చేయకూడదని కుట్రపన్ని.. కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వైఎస్.జగన్ మదిలో వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చి 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుంటే.. కూటమి ప్రభుత్వం వాటిని కోటీశ్వరుల చేతుల్లోకి పెట్టేస్తోంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
– లలిత కుమారి, మాజీ ఎమ్మెల్యే.
బాబూ.. ఒక్క ఇటుకై నా వేశావా?
చంద్రబాబునాయుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెబుతున్నారు. ఇన్నేళ్లలో ఒక్క వైద్య కళాశాలకై నా నువ్వు పునాది వేశావా..? మా నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి సిగ్గుండాలి. ప్రభుత్వ చర్యల వల్ల తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. రూ.4 వేల కోట్లు పెడితే ఇప్పటికే పలు దశల్లో ఉన్న కళాశాలలన్నీ పూర్తవుతాయి. ఆ మాత్రం కూడా పేదల కోసం నిధులు పెట్టకుండా ప్రైవేటీకరణ చేస్తోంది.
– ఎంసి.విజయానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, చిత్తూరు
కిట్ల వివరాలను
సేకరించి పంపండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసి మిగిలిన ఎస్‌ఆర్‌వీకేఎం (సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర) కిట్ల వివరాలను సేకరించి నివేదికలు పంపాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు జారీచేసిన ఉత్తర్వులు డీఈఓ కార్యాలయానికి మంగళవారం పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను పంపిణీ చేసి మిగిలిన ఎస్‌ఆర్‌వీకేఎం కిట్ల వివరాలను సేక రించాలన్నారు. నిర్దేశించిన ప్రొఫార్మాలో నిర్దేశించిన తేదీలోపు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.
అవార్డుల ప్రదానం
చిత్తూరు కలెక్టరేట్ : భారతదేశ తొలి విద్యాశాఖామంత్రి జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీ య విద్యాదినోత్సవాన్ని పురస్కరించుకుని త్వర లో ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ, విద్యార్థి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులకు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారి వివరాలను పంపాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోపు నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలను పంపాలన్నారు. జిల్లాలోని ఉర్దూ మీడియంలో 2024–25 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో టాపర్ విద్యార్థుల వివరాలను స్టూడెంట్ అవార్డులకు పంపాలని పేర్కొన్నారు. అలాగే విధుల పట్ల ఉత్తమ సేవలందిస్తున్న ఉర్దూ టీచర్ల వివరాలను పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
10న సంకటహర
గణపతి వ్రతం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన సంకటహర గణపతి వత్రం నిర్వహించనున్నట్టు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉద యం 10 నుంచి 11 వరకు, రాత్రి 5 నుంచి 6 గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7 నుంచి స్వర్థ రథోత్సవం ఉంటుందన్నారు.
నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ లక్ష్యం ప్రకారమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి, రూ.కోట్లు దోచుకోవడానికి ప్లాన్ చేసిందన్నారు. దీనిపై కూటమి పార్టీ ఎమ్మెల్యేల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ఒక్క మెడికల్ కళాశాల కూడా నిర్మించని చంద్రబాబు నాయుడు, ఏ అర్హతతో కళాశాలలను కోటీశ్వరులకు ధారదత్తం చేస్తున్నారన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షంపై కూటమి ప్రభుత్వం.. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు. మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ సరళామేరి, యాద మరి ఎంపీపీ సురేష్‌బాబు, వసంతాపురం సర్పంచ్ రజనీకాంత్, వైఎస్సార్‌సీపీ నాయకులు రామచంద్ర, గజేంద్ర, వెంకటరమణ, దొరబాబు, భరత్, ప్రసాద్ పాల్గొన్నారు.

కోర్టు తీర్పు కూటమికి చెంప పెట్టు

కోర్టు తీర్పు కూటమికి చెంప పెట్టు

కోర్టు తీర్పు కూటమికి చెంప పెట్టు