
దివ్యరూపం..మహాతేజం
చంద్రప్రభ వాహనంపై జగద్రక్షుకుడు
సూర్యప్రభ వాహనంపై మలయప్ప
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన కాంతుల్లో మలయప్ప స్వామి దేదీప్యమానంగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం సూర్య కాంతుల మధ్య స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయంలోని రంగ నాయక మండపంలో స్నపన తిరుమంజనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు సేద తీరారు. సాయంత్ర సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ఊయలూగుతూ దర్శనమిచ్చారు. ఆ తర్వాత రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవలో దివ్య మంగళ రూపంలో దర్శనమిచ్చారు. పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
నేడు శ్రీవారి రథోత్సవానికి సర్వం సిద్ధం
బుధవారం శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి రథోత్సవం సాగనుంది
చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి
గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ అధికారులు పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు
పూర్తి చేశారు.

దివ్యరూపం..మహాతేజం

దివ్యరూపం..మహాతేజం

దివ్యరూపం..మహాతేజం

దివ్యరూపం..మహాతేజం