మైనింగ్‌లో మనీ రాజా! | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌లో మనీ రాజా!

Oct 1 2025 9:59 AM | Updated on Oct 1 2025 9:59 AM

మైనింగ్‌లో మనీ రాజా!

మైనింగ్‌లో మనీ రాజా!

జిల్లాలో ఆగని దొంగ బిల్లుల దందా వసూళ్లలో రాజ్యమేలుతున్న ఓ కూటమి నేత దొంగ బిల్లులతో విచ్చలవిడిగా ఖనిజం తరలింపు దొంగ బిల్లుల వ్యవహారానికి సంబంధం లేదని చేతులెత్తేసిన అధికారులు జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా

మనల్ని ఆపేదెవడ్రా?

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: జిల్లాలో గ్రానైట్‌ మాఫియా చెలరేగిపోతోంది. పచ్చ సైన్యం ఖనిజాన్ని దోచేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతోంది. దొంగబిల్లుల దందాతో రా శ్రీరాజుశ్రీను చేస్తోంది. ఓ మంత్రి పేరును తెరపైకి తీసుకొచ్చి దొంగ బిల్లుల దందాకు ఆజ్యం పోస్తోంది. ఈ వ్యవహరంపై ఆ శాఖ అధికారులు తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. దీని కారణంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా పెడుతోంది.

దొంగ బిల్లుల గోల ఏంటి?

చిత్తూరు జిల్లా కేంద్రంలో దొంగ బిల్లుల యవ్వారం గోలగోలగా మారింది. విదేశీ గొప్పలు చెబుతూ కొత్తగా రాజకీయ తీర్థం పుచ్చుకున్న ఓ కూటమి నేత మైనింగ్‌ మాఫియాతో జతకట్టాడు. చేతికి మట్టి అంటకుండా డబ్బులు సంపాదించే పనికి పదును పెట్టాడు. గ్రానైట్‌ తవ్వకాలు కొద్ది మేరకు చేసుకుంటూ.. అక్రమ తరలింపుపై కన్నేశాడు. అధికారిక సంస్థను బయపెట్టి.. ఆ బిల్లులకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేశాడు. విదేశీ తెలివితేటలు ఉపయోగించి దొంగ బిల్లుల చలామణికి మార్గం సుగమం చేసుకున్నాడు.

మస్తు మనీ రావు?

దొంగబిల్లుల అమలుకు అన్ని రూట్లను రారాజు తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. కొందరు ప్రజాప్రతినిధులు, మంత్రుల పేరు చెబుతూ అడ్డదారుల్లో అడ్డు తొలగించుకున్నాడు. 20 నుంచి 30 మందితో కూడిన గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా రాత్రి పూట కాపు కాచి దొంగ బిల్లులు పంపిణీ చేస్తూ వస్తున్నాడు. ఒక్కో బిల్లుకు రూ.30 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. దొంగ బిల్లుల అమలులో ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఒక బిల్లుతో రెండు నుంచి మూడు ట్రిప్పుల వరకు తరలించుకోవచ్చని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అక్రమార్కులు చాలా మంది దొంగ బిల్లుల వైపే మొగ్గు చూపుతున్నారు. కాగా వసూళ్ల మొత్తాన్ని వాటాలు పంచుతూ గ్రానైట్‌ మాఫియానే మేసేస్తున్నాడని కూటమి నేతలు భగ్గుమంటున్నారు. అలా కొద్ది మేర వాళ్లకు.. వీళ్లకు పంచి.. మిగిలిన ఆదాయంతో విలువైన ఆస్తులు, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

జిల్లా యంత్రాంగం నిఘా

దొంగ బిల్లుల వ్యవహరంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మైనింగ్‌ శాఖ చేతులెత్తేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓ కమిటీని వేసింది. వారు గుట్టు చప్పుడుకాకుండా ఈ దొంగబిల్లుల మాఫియా గుట్టును కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ బిల్లుల సృష్టికర్త విషయాన్ని ఇప్పటికే అధిష్టానం వరకు తీసుకెళ్లిన ఆ నేతలు జిల్లా యంత్రాంగంతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో యంత్రాగం సైతం గట్టిగా స్పందించినట్లు సమాచారం. ఈ మేరకు కమిటీ మైనింగ్‌ మాఫియా చెక్‌ పెట్టే పనిలో పడింది. కాగా దొంగ బిల్లులను టచ్‌ చేయొద్దని పలు శాఖల అధికారులకు ఆ నేత నుంచి వార్నింగ్‌ వెళ్లినట్లు చర్చలు జరుగుతున్నాయి.

దొంగ బిల్లుల వ్యవహరం తెరపైకి రావడంతో కూటమిలో కలకలం రేపింది. జిల్లాలోని సీనియర్లంతా ఎవడు రా వీడు?.. అని ఆరా తీసే పనిలో పడ్డారు. దొంగ బిల్లుల వ్యవహరంలో కోట్లకు పడగెత్తుతున్నాడని.. మాఫియాను మట్టు పెట్టేందుకు అధిష్టానానికి కొందరు సీనియర్‌ నేతలు ఫిర్యాదు చేశారు. అయినా ఈ దొంగ బిల్లుల దందాకు అడ్డు లేకుండా చేస్తూ.. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కాపు కాస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. మంగళవారంతో అధికార బిల్లుకు గడువు ముగియడంతో ...దొంగ బిల్లుల దందాను విస్తృతం చేయాలని చూస్తున్నారు. కొత్త సంస్థకు పగ్గాలు వచ్చేంత వరకు దొంగ బిల్లుల దందాకు జోరుగా రైట్‌..రైట్‌ చెప్పాలని ఆర్డర్లు వేశారు. మంగళవారం నుంచి రారాజు ఆర్డర్లు అమలుకు నోచుకోనున్నట్లు కూటమి సీనియర్‌ నేతలే చెబుతున్నారు. అడ్డొస్తే.. కొంత మంది ప్రజాప్రతినిధులు, మంత్రుల పేర్లు చెప్పాలని గ్యాంగ్‌కు చెప్పారని వారు అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ దొంగ బిల్లుల వ్యవహరాన్ని బయటకు తీసుకొచ్చిన ఆ కూటమి నేత ఎవరు అని మైనింగ్‌ మనీ రాజా తలలు పట్టుకుంటున్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement