
బాస్కెట్‌బాల్ విజేత చిత్తూరు
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ విజేతగా చిత్తూరు జిల్లా జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు గుడివాడలో ఏపీ బాస్కెట్‌బాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో 14 పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్‌లో చిత్తూరు జట్టు, రామచంద్రాపురం (తూర్పుగోదావరి) జట్లు తలబడ్డాయి. తూర్పుగోదావరి జట్టు పై 79–66 పాయింట్ల తేడాతో చిత్తూరు జట్టు విజయకేతనం ఎగురవేసింది. క్రీడాకారులు, కోచ్, పీడీ జేమ్స్‌ను రాష్ట్ర బాస్కెట్‌బాల్ అధ్యక్షులు చెంగల్రాయనాయుడు, జిల్లా కార్యదర్శి సురేష్‌బాబు అభినందించారు. ఉత్తమ క్రీడాకారుడిగా ఆదర్శ్‌పాల్, ఉత్తమ షూటర్‌గా ఆకాష్ ప్రత్యేక బహుమతులు పొందారు. ఇద్దరు క్రీడాకారులు చిత్తూరు జట్టులోని క్రీడాకారులే కావడం గర్వకారణం.