గజరాజుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గజరాజుల బీభత్సం

Sep 19 2025 2:19 AM | Updated on Sep 19 2025 2:21 AM

● మెర్క్యూరీ సమ్మేళనాలతో కలుషిత నీటిని తాగడంతో మినిమేటా అనే వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం, వినికిడి, దృష్టి లోపాలు, మాట పడిపోవడం, జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ● ఆర్సెనిక్‌ అనే భార లోపంతో కలుషిత నీటిని తాగడంతో మూత్రాశయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్‌ వ్యాప్తి చెందుతాయి. ● రోజూ క్లోరినేషన్‌ చేయాలి. క్లోరినేషన్‌ మోతాదు తాగునీరు పైపులైల్‌ స్టార్టింగ్‌ పాయింట్‌ వద్ద ఎంత ఉందో ఇంచుమించు చివరి పాయింట్‌ వద్ద అంతే ఉండే విధంగా చూసుకోవాలి. గ్రామాలు, నగరాల్లో అసలు క్లోరినేషన్‌ జోలికే వెల్లడం లేదు. ● ఓవర్‌హెడ్‌ ట్యాంకుల పైన మూత మూసి ఉంచాలి. ఈ–కోలి బ్యాక్టీరియా వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు లేకుండా పరీక్షలు నిర్వహించాలి. నాచు, పాచి పట్టకుండా శుభ్రంగా ఉంచాలి. ఈ పనులు జిల్లాలో 80 శాతం జరగడం లేదు. ● తాగునీటి పైపులైన్లు లీకులు లేకుండా చూడటం, కొళాయిలు చుట్టూ దిమ్మెలు నిర్మించాలి. లీకేజీలను అరికట్టడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ● జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పైకప్పు లేని గుంతలు, కాలువలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో నీటి కాలుష్యం సమస్యలు ఏర్పడుతున్నాయి.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

నిండ్ర మండలంలో 40 ట్యాంకులు ఉండగా వాటిలో 15 మరమ్మతులకు గురయ్యాయి. వాటిని శుభ్ర పరచడం లేదు. ట్యాంకులున్న ప్రాంతాలకు డైరెక్ట్‌ పంపింగ్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నిండ్ర ధర్మరాజ గుడి వద్ద గల ట్యాంకు నిర్మాణం పూర్తయి 4 ఏళ్లు అవుతున్నా ఇంకా పైప్‌లైన్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు.

విజయపురం మండలంలో 32 ట్యాంకులు ఉండగా వాటిలో 11 మరమ్మతులకు గురయ్యాయి. వాటిని శుభ్ర పరచడం లేదు. వినియోగంలో ఉన్న ట్యాంకులు నెలకు ఒకసారి క్లోరినేషన్‌ చేస్తున్నారు.

పర్యవేక్షణ లోపంతో తాగునీరు కలుషితం ట్యాంకుల శుభ్రత దేవుడెరుగు కాలువల్లో తాగునీటి పైపులు పట్టణాలు, నగరాల్లో కలుషిత నీటి సరఫరా పైప్‌లైన్‌ లీకేజీలతో ప్రజలకు తప్పని ఇక్కట్లు అటకెక్కిన నీటి పరీక్షలు ముందస్తు చర్యలు పట్టని అధికారులు

పరిశ్రమలు పెట్టొద్దని ఆందోళన ద ళితుల భూముల్లో పరిశ్రమలు పెట్టొద్దని స్థానిక దళితులు ఆందోళన వ్యక్తం చేసి కలెక్టర్‌కు విన్నవించారు.
కల్లూరు, పాతపేట, జూపల్లిలోని పంట పొలాల్లో గజరాజులు బీభత్సం సృష్టించి ఆస్తి నష్టం కలిగించాయి.
పరిశుభ్రత అంతంతే..
ఏడాదికి రెండుసార్లే ట్యాంకుల శుభ్రత

పాడి రైతులను ప్రోత్సహించాలి

జిల్లాలోని మహిళా పాడి రైతులను

ప్రోత్సహించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

గాందీ పేర్కొన్నారు.

శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరోవైపు తాగునీటి కలుషితంతో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పైపులైన్‌ లీకేజీలతో తాగునీరు కలుషితం అవుతోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. రెండు నెలలకు ఒక్కసారి కూడా ట్యాంక్‌లను శుభ్రం చేయడం లేదు. కాలువల్లో పైపులైన్లు, గేట్‌వాల్వ్‌లు ఉన్నా ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో తాగునీరు విషతుల్యం అవుతోంది. సీజన్‌లో అప్రమత్తం కావాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో ప్రజలు వ్యాధులకు గురవుతున్నారు. కనీసం పర్యవేక్షణ చర్యలు కూడా తూతూమంత్రంగా చేస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లా వ్యాప్తంగా రెండు వారాలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంటింటికీ పంపిణీ చేసే తాగునీటి సరఫరాలో అనేక లోపాలున్నాయి. పైపులైన్‌ లీకేజీలతో తాగునీరు కలుషితం అవుతోంది. ప్రజలు అదే నీటిని తాగుతుండటంతో జబ్బుల బారిన పడుతున్నారు. పట్టణాలు, చిత్తూరు నగరంలో అడుగడుగునా పైపులైన్‌ లీకేజీలే దర్శనమిస్తున్నాయి. నీటిని శుద్ధి చేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ట్యాంకులను శుభ్రం చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం లాంటివి మొక్కుబడిగా చేస్తున్నారు. కొన్ని మండలాల్లో నెలలు గడుస్తున్నా ట్యాంకులు శుభ్రం చేయడం లేదు.

నెలల తరబడి అవే సమస్యలు

పల్లెలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా కలుషిత తాగునీరే సరఫరా అవుతోంది. పైపులైన్‌ లీకేజీలు, గేట్‌వాల్వ్‌ల వద్ద గుంతలతో నీటి వనరులు మురికిగా మారుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాల సమయంలో మురుగు నీటి సరఫరా ఎక్కువగా ఉంటోంది. నెలలు, సంవత్సరాలు అవుతున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని వారాలుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో తాగునీరు కలుషితమవుతోంది.

మొక్కుబడిగా నీటి నాణ్యతా పరీక్షలు

జిల్లాలోని 696 పంచాయతీలకు కాలం చెల్లిన కిట్లు సరఫరా చేయడంతో ఫలితం అంతగా కనబడటం లేదు. నీటి పరీక్షల పరంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ , పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు, వైద్యశాఖల మధ్య సమన్వయం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పరంగా పంచాయతీకి ఒక టెస్టింగ్‌ కిట్‌ అందజేశారు. వీటి ద్వారా తక్షణం వంద పరీక్షలు చేయవచ్చు. అక్కడ సమస్య ఉందని తెలిస్తే ల్యాబ్‌కు పంపి పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారు. సమస్య ఉంటే క్లోరినేషన్‌ పనులు చేస్తున్నారు. గుడిపాల, పలమనేరు, బైరెడ్డిపల్లె, పుంగనూరు, నగరి ప్రాంతాల్లో అపరిశుభ్ర నీటిని తాగి ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. తరచూ పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు నీటి పరీక్షలు చేయడం లేదు. అసలే కిట్లు కనిపించడం లేదు. జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం, నగరి ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ పరంగా నీటి పరీక్షల ల్యాబ్‌లు ఉన్నాయి. జిల్లా గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఏర్పాటు చేసిన నీటి నాణ్యత విభాగం తనిఖీలు తూతూ మంత్రంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

మూలకు చేరిన నీటి పథకాలు

పంచాయతీ పారిశుద్ద్యం, నీటి సరఫరాపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రతి సమావేశం చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో వీటిపై పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అనేక చేతిపంపులు మరమ్మతులకు గురయ్యాయి. అనేక గ్రామాల్లో పంపింగ్‌ స్కీము లు కూడా మూలన పడ్డాయి. కొన్ని ప్రాంతాకు మంచినీరు నేటికి సరఫరా అందే పరిస్థితి లేదు. కిట్లతో నీటి నాణ్యత పరిశీలించి ప్రజలకు తాగేందుకు సరఫరా చేయాలి. నీటిలో ఫ్లోరిన్‌, కలుషితం, పీహెచ్‌ ఏమోతాదు లో ఉందనే అంశాలను నీటి కిట్‌లతో తెలుసుకోవచ్చు. కానీ ఈ పరీక్షలు అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది.

కలుషిత నీటితో దుష్ప్రభావాలు ఇలా..

● నివాస గృహాల నుంచి వెలువడే మురుగు నీరు, జంతువుల మలమూత్ర విసర్జితాల నుంచి నీటిలోకి చేరి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను వ్యాధి కారకాలుగా గుర్తిస్తారు. ఇవి జీర్ణాశయ పేగు సంబంధమైన వ్యాధులకు దారితీస్తాయి.

● కలుషిత నీటిని తాగడంతో కలరా, డయేరియా, టైఫాయిడ్‌, పచ్చ కామెర్లు మొదలైన వ్యాధులు వ్యాపిస్తాయి.

● నీటిలో కాడ్మియం శాతం ప్రమాదకర స్థాయిని దాటితే ఎముకల సాంద్రతను తగ్గిస్తుంది. నీటిలో చేరిన సీసం కారణంగా మూర్ఛ వ్యాధి, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, జ్ణాపకశక్తి లోపించడం జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

ట్యాంకుల శుభ్రత ఉండాల్సి ఇలా..

నీటి ట్యాంకులను నెలకు రెండుసార్లు, పాఠశాలలు, అంగన్‌వాడీలలో నెలకు ఒకసారైనా పరిశుభ్రం చేయాలి. ఎప్పుడు శుభ్రం చేసింది తర్వాత శుభ్రం చేసే తేదీలను విధిగా ట్యాంకుల వద్ద నమోదు చేయాలి. అయితే క్షేత్రస్థాయిలో వాటిని విస్మరించారు.

● ప్రతి రక్షిత తాగునీటి పథకం వద్ద రిజిస్టర్లు ఏర్పాటు చేసి ఎంత పరిమాణం తాగునీటి సరఫరా చేసింది. బ్లీచింగ్‌ పొడి ఎంత కలిపారో నమోదు చేయాలి. అసలు రిజిస్టర్లే చాలా ప్రాంతాల్లో అమలు చేయడం లేదు.

గుర్తించిన సమస్యలు ఇలా...

● చిత్తూరు జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో లీకేజీ సమస్యలు ఉండటంతో మురుగు నీరు పైపులైన్‌లలోకి చేరి తాగునీరు కలుషితం అవుతోంది. ఇలాంటి లీకేజీలు 100కు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది.

● జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో వాగులు, కాలువల నుంచి నేరుగా మోటార్ల సాయంతో నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. దీంతో తాగునీరు కలు షితం అవుతోంది.

● ఓవర్‌హెడ్‌ ట్యాంకులను సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో తాగునీరు కలుషితం అవుతోంది. చాలా ట్యాంకులలో పాచి పేరుకుపోయింది. అధికారులు అలసత్వం వహిస్తున్నారు.

నిండ్ర ధర్మరాజ గుడి వద్ద పైపులు బిగించని ట్యాంకు

చిత్తూరులోని ల్యాబ్‌లో నీటి పరీక్షలు

బిల్డింగ్‌ కోర్సుకు

దరఖాస్తు చేసుకోండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో అర్హులైన అభ్యర్థులు స్పెషల్‌ కెపాసిటీ బిల్డింగ్‌ కోర్సుకు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో కోర్సు నిర్వహిస్తున్నారన్నారు. కోర్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో స్పోర్ట్స్‌ కోటాలో పనిచేసే క్రీడాకారుల నైపుణ్యాలు, వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఎటువంటి ప్రామాణిక, దీర్ఘకాలిక సెలవు అవసరం లేకుండా కోర్సును రెండు సంవత్సరాల వ్యవధి లోపు పూర్తి చేయవచ్చన్నారు. క్రీడాకారుల ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు 9599303866 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

15 నుంచి గాలికుంటు నివారణ టీకాలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా లు వేస్తున్నట్లు జిల్లా పశువైద్యాధికారి ఆరీఫ్‌ తెలిపారు. ఈనెల 15 నుంచి పశువులకు టీకాలు వేస్తున్నామన్నారు. జిల్లాకు 4.52 లక్షల డోస్‌ల వ్యాక్సినేషన్‌ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్‌ 15 వరకు కొనసాగుతుందని, పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరో రెండు బార్లకు లైసెన్సులు

చిత్తూరు అర్బన్‌ : జిల్లాలో మద్యం బార్ల నిర్వహణ కోసం రెండో విడత జారీ చేసిన నోటిఫికేషన్‌లో రెండు బార్లను నిర్వాహకులు దక్కించుకున్నారు. చిత్తూరు నగరంలో 5, పలమనేరులో ఒక బార్‌ ఏర్పాటు చేయడానికి ఈనెల 3న అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. చిత్తూరు నగరంలో ఒకటి, పలమనేరులో ఓ బార్‌ కోసం బుధవారం ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి. వీటిని గురువారం చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ లాటరీ తీసి, లైసెన్సులు ఎవరికి దక్కాయో ప్రకటించారు. మూడేళ్ల కాలపరిమితి ఉండేలా లైసెన్సులు జారీ చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. కాగా చిత్తూరులో ఎన్‌పీఎస్‌, పలమనేరులో రాజలక్ష్మి అనే ఇద్దరు బార్‌ లైసెన్సులను దక్కించుకున్నారు.

ఆడిట్‌ నివేదికలు పంపండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు సేకరించిన భూ వివరాలకు సంబంధించిన ఆడిట్‌ సమాధానాల నివేదికలు వెంట నే పంపాలని తహసీల్దార్లను డీఆర్‌వో మోహన్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో తహసీల్దార్లతో మాట్లాడారు. పుంగనూరులో సర్వే నంబర్‌ 335/2లో ఇళ్ల పట్టాలకు సేకరించిన భూమిని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారనే అంశంపై వివరణ ఇవ్వాలన్నారు. అదే విధంగా పుంగనూరులో ఇళ్ల పట్టాలకు 363 మందికి ఒక సెంట్‌ భూమికి బదులు 1.5 సెంట్ల భూమి, 452 మందికి 8.22 ఎకరాల భూమి సేకరించగా కేవలం 246 మందికి మాత్రమే పంపిణీ చేశారనే అభియోగాలపై విచారణ చేయాలన్నారు. చిత్తూరు నగర పరిధిలోని అనుపల్లి, బండపల్లి, దొడ్డిపల్లి ప్రాంతాల్లో భూ సేకరణ ఎక్కువ చేశారనే ఫిర్యాదులున్నాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల భూమి పంపిణీ చేయాల్సి ఉండగా, ఇష్టానుసారం పంపిణీ చేశారన్నారు. ఇందుకు గల కారణాలను తహసీల్దార్ల నుంచి ఆర్‌డీవోలు సేకరించి నివేదికలను కలెక్టరేట్‌కు పంపాలని డీఆర్‌వో ఆదేశించారు.

నేడు జిల్లా జూనియర్‌

కబడ్డీ జట్ల ఎంపిక

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక శుక్రవారం సదుం మండల కేంద్రంలోని పోలీస్‌ గ్రౌండ్‌లో మధ్యా హ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు మమత, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రవీంద్రరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. 2006 డిసెంబర్‌ 31 తర్వాత జన్మించిన వారే పాల్గొనడానికి అర్హులని, బాలురు 75 కేజీలలోపు, బాలికలు 65 కేజీలలోపు బరువు ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు, 10వ తరగతి మార్కుల జాబితాతో పాటు ఐదు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికై న వారు 25 నుంచి 28వ తేదీ వరకు విజయవాడలోని గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9440345455 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

జిల్లాలోని పంచాయతీలు 696

మొత్తం చేతిబోర్లు 8,329

బోరు బావులు 6,734,

ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు 2,886

ఓఎస్‌ఎల్‌ఆర్‌ ట్యాంకులు 699

శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

మహిళ ల ఆరోగ్యమే కుటుంబానికి రక్ష

ఐరాల : మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం శ్రేయస్సుగా ఉంటుందని , కుటుంబం శ్రేయస్సుగా ఉంటే సమాజం శక్తివంతమవుతుందని, అందుకే మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి సూచించారు. గురువారం స్థానిక పీహెచ్‌సీలో వైద్యాధికారి రెడ్డెప్ప ఆధ్వర్యంలో స్వస్త్‌ నారీ– స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రత్యేక వైద్య శిబిరాలు అక్టోబర్‌ 2 వరకు కొనసాగుతాయన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయడం, కుటుంబ సుభిక్షానికి పునాది వేయడం కార్యక్రమం లక్ష్యమని వివరించారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషలిస్ట్‌ డాక్టర్లు రక్తహీనత సమస్యలపై పరీక్షలు, సలహాలు, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు, గర్భధారణ జాగ్రత్తలు, తల్లీ బిడ్డ ఆరోగ్యానికి వైద్య సూచనలు, ప్రసూతి అనంతరం సంరక్షణ, తదితర వ్యాధులపై అవగాహన కల్పిస్తారన్నారు. అనంతరం స్పెషలిస్ట్‌ డాక్టర్లు మహిళలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్‌ ప్రవీణ, వైద్యాధికారి రెడ్డెప్ప , స్పెషలిస్ట్‌ డాక్టర్లు ఉషా, సంధ్య, శ్రీవాణి, అర్పిత, వెంకట్‌రావు, మునికుమార్‌, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీ

కాణిపాకం పీహెచ్‌సీ పరిధిలోని జంగాలపల్లెలో నిర్వహిస్తున్న స్వస్త్‌ నారీ– సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని బుధవారం డీఎంహెచ్‌ఓ సుధారాణి తనిఖీ చేశారు. మహిళలకు అందుతున్న వైద్య సేవలపై పీహెచ్‌సీ డాక్టర్‌ స్వాతిసింధూరని అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా వైద్య సిబ్బంది చొరవ చూపాలని ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరంలో 640 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. జిల్లా ఎన్‌హెచ్‌ఎం కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాల్లో రెండవ రోజైన గురువారం స్వామి వారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టు, ఉత్సవర్లకు, పద్మావతీ, ఆండాళ్‌ అమ్మవారు, జయ విజయులు, గరుడాళ్వార్‌, ఆంజనేయస్వామికి, ధ్వజస్థంభం, ఇతర పరివార దేవతలకు పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌, సూపరింటెండెంట్‌ శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌ పర్యవేక్షించారు.

పవిత్రోత్సవాల్లో నేడు :

పవిత్రోత్సవాల్లో మూడవ రోజు శుక్రవారం ఉదయం 9–30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. 11–30 గంటల నుంచి 12–30 గంటల మధ్య స్వామి అమ్మవార్లకు మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన నిర్వహించనున్నారు.

పాచిపట్టిన ట్యాంకులు

పాలసముద్రం : మండలంలో తాగునీటి ట్యాంకు ను క్లోరినేషన్‌ చేయాల్సి ఉన్నా ఏ ఒక్క గ్రామా ల్లో అమలు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఏదో మొక్కుబడి గా ట్యాంకుల్లో బ్లీచింగ్‌ కలిపి తాగునీటిని సరఫరా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రక్షిత మంచినీటి ట్యాంకులకు సరిగా శుభ్రం చేయకపోవడంతో పాచి పెరిగి కలుషిత నీరు సరఫరా అవుతోందని చెబుతున్నారు. పాలసముద్రం మండలంలో రక్షిత నీటి పథకం నిర్వహణ పంచాయతీ , ఆర్‌డబ్యూఎస్‌ అధికారులు పటించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ఎంపీడీఓ సతీష్‌ను వివరణ కోరగా ఆరు రోజులకొకసారి తప్పకుండా క్లోరినేషన్‌ బ్లీచింగ్‌ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. క్లోరినేషన్‌ సక్రమంగా చేపట్టకపోతే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జాడలేని నీటి నాణ్యత పరీక్షలు

నీటిలో నాణ్యత ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. వర్షాకాలం నేపథ్యంలో విధిగా తాగునీటి పరీక్షలు పెంచాల్సి ఉండగా అందుకు భిన్నమైన పరి స్థితి నెలకొంది. ప్రధానంగా పైప్‌లైన్‌్‌ లీకేజీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. జలశయాలు, ట్యాంకుల వద్ద నమూనాలు సేకరించి పరీక్షలు విధిగా చేయాలి. నాణ్యత లోపించినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామా ల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొళాయిలను గాలికి వదిలేస్తున్నారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ విషయాన్ని అధికారులు పూర్తిగా మరిచిపోయారు. ట్యాంకులు, మురికివాడల నుంచి సరఫరా అయ్యే నీటికి నాణ్యత పరీక్షలు చేయడం లేదు. ముఖ్యంగా పాఠశాలలు కొళాయిల్లో నీటిని పరీక్షించాలనే బాధ్యతను అధికారుల విస్మరించారు.

జిల్లా సమాచారం

నగరి : నగరిలో తాగునీటి సరఫరాకు 18 ట్యాంకులు ఉండగా వాటిలో 11 మరమ్మతులకు గురయ్యాయి. 7 ట్యాంకులు మాత్రమే వినియోగిస్తున్నారు. వినియోగించే ట్యాంకుటను 15 రోజులకు ఒకసారి శుభ్రపరచి క్లోరినేషన్‌ చేస్తున్నారు. ట్యాంకులు వినియోగంలో లేని ప్రాంతాలకు డైరెక్ట్‌ పంపింగ్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తరచూ మోటార్లు రిపేరు అవుతుండటం, జాతీయ రహ దారి పనుల్లో భాగంగా పైపులు పగలడం కారణాలతో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో సమస్యలున్నాయి. నగరి మున్సిపాలిటీలో రెండు నెలలక్రితం వాటర్‌ టెస్టింగ్‌ చేశారు. ప్రస్తుతం శాంపిల్స్‌ పంపారు. ఇంకా రిపోర్టు రాలేదు.

బంగారుపాళెం : మండలంలో తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంది. ట్యాంకుల పరిశుభ్రతపై పెద్దగా దృష్టి సారించలేదు. నిబంధనల ప్రకారం 15 రోజులకు ఒక్కసారి తాగునీటి ట్యాంకులు బ్లీచింగ్‌తో శుభ్రం చేసి , క్లోరినేషన్‌ చేసిన నీరు సరఫరా చేయాల్సి ఉంది. అంతే కాకుండా తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. నీటి నాణ్యత పరీక్షలకు గత ప్రభుత్వంలో అందించిన కిట్లు ఏమయ్యాయో తెలియడంలేదు. సంవత్సరానికి రెండు , మూడు సార్లు తప్ప ట్యాంకులు శుభ్రం చేయరని ప్రజలు చెబుతున్నారు. మండలంలో 41 గ్రామ పంచాయతీల పరిధిలో 180 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 200 ట్యాంకులపైగా ఉన్నాయి.

ఏడాదికి ఒక్కసారే ట్యాంకు శుభ్రం

ఏడాదికి ఒక్కసారే తాగునీటి ట్యాంకు క్లోరినేషన్‌, బ్లీచింగ్‌ చేస్తున్నారు. మరుగు నీరు కాలువలు కూడా శుభ్రం చేయకపోవడంతో దోమలు తాకిడి అధికమైంది. కంటి నిండా నిద్ర ఉండడం లేదు.

– ఆనట్స్‌రాజ్‌, ఆముదాల దళితవాడ,

పాలసముద్రం మండలం

రోగాల బారిన పడుతున్నాం

చాలా రోజులుగా తాగునీటి ట్యాంకును శుభ్రం చేయకపోవడంతో అందులో వస్తున్న నీటిని తాగడంతో రోగాలు వస్తున్నాయి. వారానికి ఒకసారి తాగునీటి ట్యాంకును శుభ్రం చేసి, క్లోరినేషన్‌, బ్లీచింగ్‌ పౌడర్లు వేయాలి.

– ధనపాల్‌, ఆముదాల , పాలసముద్రం మండలం

గజరాజుల బీభత్సం 
1
1/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
2
2/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
3
3/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
4
4/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
5
5/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
6
6/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
7
7/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
8
8/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
9
9/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
10
10/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
11
11/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
12
12/13

గజరాజుల బీభత్సం

గజరాజుల బీభత్సం 
13
13/13

గజరాజుల బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement