‘స్వస్థ్‌ నారీ’వెతలు | - | Sakshi
Sakshi News home page

‘స్వస్థ్‌ నారీ’వెతలు

Sep 19 2025 1:51 AM | Updated on Sep 19 2025 1:51 AM

‘స్వస

‘స్వస్థ్‌ నారీ’వెతలు

● జిల్లాలో ప్రారంభమైన స్వస్థ్‌ నారీ–సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ ● 15 రోజుల పాటు మహిళలకు వైద్య పరీక్షలు ● మొక్కుబడిగా కార్యక్రమ నిర్వహణ

దళితుల భూముల్లో

పరిశ్రమలు పెట్టొద్దని ఆందోళన

శ్రీరంగరాజపురం : పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, రాష్ట్ర ఏపీఐఐసీ ప్రతినిధి సుబ్బరావుతో కలిసి మండలంలోని 56–కనికాపురం పాతపాళ్యం, జీఎంఆర్‌పురం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ, డీకేటీ, ప్రైవేటు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు మండలంలోని పరిశ్రమలు ఏర్పాటుకు 1000 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు.

మా భూముల్లో పరిశ్రమలు పెట్టొద్దు : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పాతపాళ్యం దళితులకు, జీ.ఎం.ఆర్‌.పురం ఎస్టీలకు భూమి లేని పేదలకు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పేరుతో దళితుల భూములను లాక్కోవాలని చూస్తోందని వాపోయారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని , త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. కార్యక్రమానికి తహసీల్దార్‌ లోకనాథపిళ్‌లై, మండల సర్వేయర్‌ సురేష్‌, ఎంపీడీఓ వనజ, సచివాలయం, రెవెన్యూ సిబ్బంది త దితరులు పాల్గొన్నారు.

గజరాజుల బీభత్సం

పులిచెర్ల (కల్లూరు) : మండలంలోని కల్లూరు, పాతపేట, పాళెం, జూపల్లె, పూరేడువారిపల్లె, ఎద్దలవారిపల్లెలోని పొలాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు మామిడి కొమ్మలు, కొబ్బరి చెట్లు, వరి పంటను నాశనం చేశాయి. జూపల్లెకు చెందిన నరసింహులు, నాగరాజు, నరేష్‌ పొలాల్లో మామిడి తోటల్లో కొమ్మలు విరిచేశాయి. అలాగే కల్లూరులో ఇక్బాల్‌, రాజన్న పొలాల్లో పశుగ్రాసం తొక్కేయగా, మామిడి కొమ్మలు విరిచేశాయి. దాము పొలంలో వరి, కొబ్బరి చెట్లను నాశనం చేశాయి. పంట పొలాలపై ఏనుగులు రాకుండా కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : స్వస్థ్‌ నారీ–సశక్త్‌ పరివార్‌ అభియాన్‌కు నిధుల కొరత వేధిస్తోంది. ప్రారంభంలోనే అభియాన్‌ అష్టకష్టాలు పడుతోంది. నిర్వహణకు ముందస్తు వ్యయం లేక కార్యక్రమం నీరసించిపోతోంది. క్షేత్రస్థాయిలోని అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తే చేతులెత్తేస్తున్నారు. ఆ ఖర్చులు తాము భరించలేమంటూ సిబ్బంది సైతం వెనకడుగు వేస్తున్నారు. ఖర్చు పెడితే తర్వాత బిల్లు లు ఇస్తామని జిల్లా అధికారులు ఖర్చు మాటను దాట వేస్తున్నారు. దీంతో కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది.

మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్థ్‌ నారీ సశక్త్‌ అభియాన్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమం తలపెట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, అవసరమైన చికిత్సలు, వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక , పట్టణ, సామాజిక , ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాల ఆసుపత్రులు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులు సహకారంతో మహిళలు, పిల్లల కేంద్రీకృత ఆరోగ్య శిబిరాలు నిర్వహణ స్క్రీనింగ్‌, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

538 శిబిరాలు

జిల్లా వ్యాప్తంగా 538 శిబిరాలు చేపట్టేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నా రు. ఈ క్యాంపులను 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 437 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు , 5 సీహెచ్‌సీలు, 3 ఏరియా ఆస్పత్రులు, 2 స్పెషలిస్ట్‌ క్యాంపులు నిర్వహించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే క్యాంపు నిర్వహణ క్షేత్ర స్థాయిలో కష్టతరంగా మారింది.

శిబిరం నిర్వహణలో గందరగోళం

ముందస్తు ప్రణాళికల ప్రకారం క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే క్యాంపు నిర్వహణ ఏర్పాట్లకు ముందస్తు వ్యయం చేసే వారు లేక క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు సైతం పలు చోట్ల చేతులెత్తేస్తున్నారు. ఖర్చు చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు. షామీయానా, కుర్చీలు, టేబుళ్లు, మధ్యాహ్నం భోజనం, టీ, కాఫీ, బిస్కెట్క్‌...ఇలా ఒక్కో క్యాంపునకు రూ. 10 వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు అవుతోంది. దీంతో చాలా మంది మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలోని సిబ్బందిపై భారం మోపుతున్నారు. ముందు ఖర్చు పెడితే..తర్వాత బిల్లులు వస్తాయని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వైద్య సిబ్బంది అంతా డబ్బులు ఎక్కడి నుంచి పెట్టాలని వాపోతున్నారు.

ప్రజల్లో కొరవడిన అవగాహన

మహిళా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల్లో అవగాహన కొరవడుతోంది. ముఖ్యంగా మహిళలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడం లేదు. పలు చోట్ల నిర్వహణపై మహిళలకు సమాచారం లేదు. దీంతో క్యాంపులో మహిళలు రాక శిబిరం వెలవెల బోతోంది. కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మహిళల కంటే వైద్య సిబ్బందే అధికంగా కనిపిస్తున్నారు. క్యాంపు లక్ష్యం అధిగమించలేకపోతున్నారు. పలుచోట్ల బలవంతంగా మహిళలను శిబిరాలకు లాక్కొస్తున్నారు. మహిళలు క్యాంపునకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు కొన్ని రకాల మందులు, మాత్రలు మాత్రమే ఉన్నాయని, చాలా వరకు లేవని వైద్య సిబ్బంది చెబుతున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు ముందుగానే మండల ప్రజా పరిషత్‌కు నిధులు కేటాయించి, ఇబ్బందులు లేకుండా క్యాంపులు జరిపించామనే విషయాన్ని వైద్య బృందం గుర్తు చేస్తోంది.

రామాపురం క్యాంపులో మహిళలు లేక ఖాళీగా దర్శమిస్తున్న కుర్చీలు

తవణంపల్లిలోని క్యాంపులో అరకొరగా ఇలా..

ఓపీరకం సంఖ్య

సాధారణ ఓపీ 10193

ఏఎన్‌సీ 1133

ఎంసీపీ కార్డు మంజూరు 106

ఆస్పత్రి క్యాంపుల సంఖ్య

జిల్లా ఆస్పత్రి 1

సీహెచ్‌సీ 6

పీహెచ్‌సీ 7

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ 77

రెండు రోజుల పాటు క్యాంపు వివరాలు

ఓపీ వివరాలు

‘స్వస్థ్‌ నారీ’వెతలు 1
1/1

‘స్వస్థ్‌ నారీ’వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement