
పాత్రికేయులను భయపెడుతున్నారు
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను పత్రికల్లో రాసినందుకే విలేకరులపై ప్రతాపం చూపుతున్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలకంగా పనిచేస్తాయి. ప్రజాపక్షాన నిలబడే పత్రికలపై జులుం ప్రదర్శిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. పాత్రికేయులను భయపెడుతున్నారు. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. నిజాలను వెలుగులోకి తీసుకురావడం ప్రతికల హక్కు. ఆ హక్కును హరించడం దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పత్రికలపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో విషసంస్కృతిని తీసుకువస్తున్నారు. విలేకరులకు స్వేచ్ఛ ఇవ్వాలి. లేకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– లలితా థామస్, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు