
సొసైటీని కొనసాగించాలి
విద్యుత్ స్టోర్స్ పనులు కాంట్రాక్టర్ సంస్థకు! రోడ్డున పడనున్న హమాలీలు 15న నిరవధిక దీక్షకు సిద్ధమవుతున్న కూలీలు
గత 40 ఏళ్లుగా సొసైటీ ద్వారా విద్యుత్ స్టోర్స్‌లో హమాలీలు పనిచేస్తున్నారు. హమాలీ సొసైటీకి పనులు ఇస్తుండడంతో ఉన్న కార్మికులే కొనసాగుతున్నారు. ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వడం అన్యాయం. దీంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతాయి.
– ఆర్యోగదాస్, రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ స్టోర్స్ హమాలీ యూనియన్
అన్యాయం
కార్మికుల కష్టాలను తీరుస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. తీరా వారి కడుపు కొట్టాలని యత్నిస్తోంది. ఎక్కడో అనంతపురంలో అమలైన విధానాన్ని చిత్తూరు జిల్లాలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. వారికి వసతులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేయాలని యత్నించడం అన్యాయం.
– గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సీఐటీయూ
●
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్టోర్స్ నుంచి విద్యుత్ పరికరాలు సరఫరా చేస్తున్నారు. చిన్న బోల్టు నుంచి సబ్‌స్టేషన్‌లో బిగించే పరికరాల వరకు ఈ స్టోర్స్ నుంచే తీసుకెళ్తుంటారు. ఇక్కడ 15 మంది హమాలీలు 40 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు వారిని తొలగించి కొత్తగా కాంట్రాక్ట్‌కు పనులు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. దీనిపై హమాలీ కార్మికులు రగిలిపోతున్నారు. తమ పొట్టకొట్టొద్దు బాబూ అంటూ గళం ఇప్పుతున్నారు.
కూలీల్లో కోత
హమాలీలు వీటి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. తొలుత కూలి విధానంలో విద్యుత్ పరికరాల లోడింగ్, ఆన్‌లోడింగ్ చేసేవారు. 2008 నుంచి సంస్థలో పీస్‌రేటు సిస్టమ్ అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్న హమాలీ సొసైటీకే కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పనులను సొసైటీకి కాకుండా విద్యుత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. కార్మికుడు పీస్ వర్క్ కింద వస్తువులను బట్టి రూ.0.25 పైసల నుంచి రూ.1200 వరకు ట్రాన్స్‌కో చెల్లిస్తోంది. రోజూ కార్మికుడు సరాసరి రూ.500–1,500 వరకు సంపాదిస్తున్నారు. సైడ్ హారం పరికరానికి రూ.2–6, తుక్కు కేజీకు రూ.0.70 పైసలు నుంచి ప్రారంభమవుతుంది. 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను వాహనంలో పెడితే రూ.230, 63 కేవీ అయితే రూ.375, అదే సబ్‌స్టేషన్‌లో పెట్టే వీసీబీ(బ్రేకర్స్)కు రూ.1,286 ఇస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తే వీరందరూ రోడ్డున పడాల్సిందే.
విద్యుత్ పరికరాలు
విద్యుత్ పరికరాలు ఎత్తిపెడుతున్న కార్మికులు
అనంతపురంలో అమలు చేశారనీ..!
అనేక సంవత్సరాలుగా ట్రాన్స్‌కో స్టోర్స్‌లో పీసు రేటు కింద హమాలీ సొసైటీకి పనులను ఇస్తున్నారు. ఇప్పుడు కార్మికుల కష్టం పై కూటమి నాయకులు కన్నేశారు. ఇందుకు బీజంగా అనంతపురం జిల్లాలో ఆ సొసైటీకి కాకుండా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ విధానాన్ని చిత్తూరు జిల్లాలో కూడా అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సొసైటీని కొనసాగించాలి

సొసైటీని కొనసాగించాలి

సొసైటీని కొనసాగించాలి

సొసైటీని కొనసాగించాలి