
ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
పెళ్లకూరు : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి స్వగ్రామమైన పుల్లూరులో శుక్రవారం గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాల్లో భాగంగా అక్రమంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి త్వరలో విడుదల కావాలని గ్రామ దేవతకు పూజలు చేసినట్లు చెప్పారు. అమ్మవారికి కుంకుమార్చన, పుష్పయాగం చేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పూజలు చేశారు. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేకుండా ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి బెయిల్ రాకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్‌రెడ్డి, మణినాయుడు, వెంకటాచలం, వీరాస్వామిరెడ్డి, రమణయ్య, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.