
బ్రహ్మోత్సవం.. లంబోదరుడి వైభవం!
అంగరంగ వైభవంగా వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు చిలుక, వృషభ వాహనాలపై చిద్విలాసం తరలివచ్చిన భక్తజనం నేడు గజ వాహన సేవ
కాణిపాకం: కాణిపాక వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. అభిషేకంతో పాటు నిత్యపూజలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం చిలుక, వృషభ వాహనాలపై స్వామి వారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఉదయం మూలస్థానంలోని స్వామివారికి విశేష అభిషేక పూజలు, అలంకరణలు చేశారు. అలంకార మండపంలో శ్రీసిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ హారతులతో చిలుక వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. రాత్రి వృషభ వాహనంపై ఊరేగుతూ స్వామి వారు అభయమిచ్చారు. అంతకుముందు ఉభయదారులు ఊరేగింపుగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా మంగళవారం జగవాహన సేవలో స్వామివారు తరిస్తారని ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. ఈ వాహనసేవకు కాణిపాకం వన్నియ నాయకర్ వంశస్తులు ఉభయదారులుగా వ్యవ హరిస్తారని ఆయన పేర్కొన్నారు.
వృషభ వాహనంపై విఘ్నేశ్వరుడు
తాగేసి..
విగ్రహాన్ని కూల్చేసి!