
ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టాలి
చిత్తూరు అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజలు ఇచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుపైనా ఆయా పోలీస్ స్టేషన్ల హౌజ్ ఆఫీసర్లు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. మొత్తం 32 వినతులు అందాయి. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బెదిరింపులకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.