
పింఛను సొమ్ముతో ఉడాయించిన పంచాయతీ కార్యదర్శి
పుంగనూరు: సామాజిక పింఛను డబ్బులు తీసుకుని ఓ ఉద్యోగి పారిపోయాడు. పుంగనూరు మండలంలో బండ్లపల్లెకి చెందిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు రెండు రోజుల క్రితం పింఛనుదారులకు పంపిణీ చేసేందుకు బ్యాంక్ నుంచి రూ.6.34 లక్షలు డ్రా చేశాడు. సోమవారం సాయంత్రం వరకు బండ్లపల్లెలో పెన్షన్ పంపిణీ చేయలేదు. అధికారులకు లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి... పింఛను డబ్బులతో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పారిపోయినట్లు నిర్ధారించారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో లీలామాధవి తెలిపారు. కాగా, బెట్టింగ్‌లకు అలవాటుపడిన శ్రీనివాసులు పింఛను డబ్బుతో ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది.