
హోరాహారీగా రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాల్‌లో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 350 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. యువన్య బ్రెయిన్ బాక్స్ చెస్ అకాడమీ, ఆంధ్రా చెస్ అసోసియేషన్‌లు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ నిర్వహించాయి. ఈ టోర్నీలో భవన్ (ఎన్టీఆర్ జిల్లా), రాజు (ప్రకాశం), హర్షప్ (తిరుపతి) విద్యార్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కై వశం చేసుకున్నారు. టోర్నీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్, జిల్లా చైర్మన్ బాబుప్రసాద్‌రెడ్డి, టోర్నీ డైరెక్టర్ యువన్య, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి రాఘవులు, న్యాయవాది కృష్ణకిషోర్, సభ్యులు వెంకటేష్, బాలు, లేఖ్య, పిళ్‌లై, దినేష్, సురేఖ పాల్గొన్నారు.