
వరసిద్ధుని సేవలో ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం హర్యానా రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్‌సింగ్ చౌతాలా దర్శించుకున్నారు. అలాగే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు, స్వామి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు పాల్గొన్నారు.
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు సోమవారం గంటూరుకు చెందిన అంజిరెడ్డి రూ.లక్షను విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు.
ఇండియా రగ్బీ జట్టుకు ఎంపిక
పలమనేరు: పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన నర్రా సురేష్ కుమార్తె నర్రా అక్షయ అండర్–20 ఇండియా రగ్బీ జట్టుకు ఎంపికై ంది. ఇటీవల చైన్నెలో జరిగిన ఈ ఎంపికలో అక్షయ విశేష ప్రతిభకనబరిచిందని ఆమె తండ్రి తెలిపారు. కాగా చైన్నెలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పాన్సర్లు సినీ హీరో రాహుల్ బోస్ ద్వారా ఇండియా జెర్సీలను జట్టుకు అందజేశారని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్కూల్ గేమ్స్ సెక్రటరీ పోస్టుకు అర్హత, ఆసక్తి గల పీడీ, పీటీలు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2025–26 నుంచి 2026–27 సంవత్సరం వరకు స్కూల్ గేమ్స్ సెక్రటరీ (అండర్ 14, 17, 19) నియామకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ 58 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పీడీ, పీఈటీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 7 వ తేదీలోపు దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.
నేడు ‘టీ తాగుతూ మాట్లాడదాం రండి’
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం కలెక్టరేట్‌లోని క్యాంటీన్‌లో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య తెలిపారు.

వరసిద్ధుని సేవలో ప్రముఖులు

వరసిద్ధుని సేవలో ప్రముఖులు