
అత్యవసర నంబర్లపై అవగాహన ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్ : బాలికలకు అత్యవస నంబర్లపై అవగాహన ఉండాలని చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్ సీఐ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మేరకు సోమవారం నగరంలోని విజయం డిగ్రీ కళాశాలలో మహిళా శక్తి యాప్, అత్యవసర ఫోన్ నంబర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం శక్తి యాప్ అమలు చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థినీ మహిళా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. కళాశాలలో శక్తి వారియర్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని, గ్రూప్ ప్రత్యేకతలను వివరించారు. కళాశాల చైర్మన్ తేజోమూర్తి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
చిత్తూరు అర్బన్: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ రాంబాబు కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్ క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 55 ఫిర్యాదులు వచ్చాయి.

అత్యవసర నంబర్లపై అవగాహన ముఖ్యం