
మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని ప్రార్థనలు
చౌడేపల్లె: అక్రమ మద్యం కేసులో కుట్రపూరితంగా రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డిని జైలుకు పంపారని, త్వరగా ఆయనకు బెయిల్ రావాలని కోరుతూ దాదేపల్లెలోని మషాయక్ బహదూర్ అలీషాబాబా దర్గాలో చౌడేపల్లె కాగతి సర్పంచ్ షంషీర్, మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సనావుల్లాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం దర్గాలో బాబా మజ్జార్‌కు చాదర్‌ను కప్పి గంధం, పూలు సమర్పించి మత పెద్దల చేత ప్రత్యేక ప్రార్థనలు, దువ్వా చేశారు. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించాలని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష సాధింపులు మానుకునే విధంగా చూడాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అన్యాయంగా మిథున్‌రెడ్డిను అక్రమ కేసులు ఇరికించారని, ఆకేసునుంచి విముక్తికల్గిలా చూడాలని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంభానికి మనోధైర్యం ప్రసాదించి బెయిల్ త్వరగా రావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు షేర్‌ఖాన్, రియాజ్ అహమ్మద్, బషీర్‌సాబ్, జహీర్, నవాబ్, ఈనూస్, నిజాం, మాలిక్ తదితరులున్నారు.