కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు | - | Sakshi
Sakshi News home page

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు

May 8 2025 7:55 AM | Updated on May 8 2025 7:55 AM

కుట్ట

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు

మాకింత విషమిచ్చి..
మాకింత విషమిచ్చి మా ప్రాణాలు తీసి, భూములు తీసుకుని, ఫ్యాక్టరీలు కట్టుకోండని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లూరి ఆశయాలు ఆదర్శం
● సగం సెంటర్లలోనే శిక్షణ ప్రారంభం ● ఎంపికలో రాజకీయ ప్రమేయం ● కేంద్రాలలో అరకొర సౌకర్యాలు ● కొన్ని సెంటర్లలో పాడైన కుట్టుమిషన్ల ఏర్పాటు

వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదామ ని మాజీ మంత్రి ఆర్కే రోజా వైఎస్సా ర్‌ సీపీ నేతలకు పిలుపునిచ్చారు.

గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025

10లో

చిత్తూరు కలెక్టరేట్‌ : అభం శుభం ఎరుగని చిన్నారుల ఆరోగ్యంపై కూటమి సర్కారు కాఠిన్యం ప్రదర్శిస్తోంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించినా రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకుండా వేడుక చూస్తోంది. పైగా అంగన్‌వాడీ కార్యకర్తలకు 15 రోజులు, ఆయాలకు 15 రోజులు సెలవులు మంజూరు చేసినా, ఎవరో ఒకరు కేంద్రా న్ని నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చాలీచాలని ఇ రుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు వేసవి కారణంగా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రస్తుతం పాఠశాల, కళాశాల, డిగ్రీ విద్యార్థులందరికీ వేసవి దృష్ట్యా సెలవులు ఇచ్చేశారు. అయితే అభం శుభం ఎరుగని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మా త్రం కూటమి సర్కారు సెలవులు ప్రకటించలేదు. మండుతున్న ఎండల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు వేసవి తాపం తట్టుకోలేపోతున్నారు.

గ్రామీణ నిరుద్యో యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం సీడాప్‌ సౌజన్యంతో నిహార్‌ స్కిల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ రాజాసింగ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు డీడీయూ–జీకేవై పథకంలో జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ వెబ్‌ డెవలపర్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌, బ్యూటీ థెరపీ కోర్సుల్లో నాలుగు నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. వైఎస్సార్‌ కడప కేంద్రంలో ఇచ్చే ఈ శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు భోజనం, వసతి, కంప్యూటర్‌ నైపుణ్యాలు, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, లైఫ్‌ స్కిల్స్‌ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికెట్‌ తోపాటు అర్హతను ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 18–30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. జిల్లాలోని గ్రామీణ పేద కుటుంబాల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌ఐహెచ్‌ఏఆర్‌ఎస్‌కేఐఎల్‌ఎల్‌.సీవోఎం (www.niharrki.com) లో రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9063082227, 9966448807 నంబర్లలో సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా కోర్టులో 171 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

చిత్తూరు అర్బన్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని న్యాయస్థానాల్లో పలు పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 171 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందులో స్టెనోగ్రాఫర్‌ 7, జూనియర్‌ అసిస్టెంట్‌ 25, టైపిస్ట్‌ 13, ఎగ్జామినర్‌ 3, కాపీయిస్ట్‌ 17, ప్రోసెస్‌ సర్వర్‌ 21, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 85 చొప్పున ఖాళీలున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.aphc.gov.in అనే వెబ్‌సైట్‌లో ఈనెల 13 నుంచి వచ్చేనెల 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే జిల్లా కోర్టు పరిధిలో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారు ఈనెల 13 నుంచి వచ్చేనెల 24వ తేదీలోపు చిత్తూరులోని జిల్లా కోర్టుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇతర వివరాలకు చిత్తూరు జిల్లా కోర్టులోని పరిపాలన అధికారిని సంప్రదించాలని న్యాయశాఖ అధికారులు తెలిపారు.

సిందూర్‌ విజయవంతంపై జెడ్పీ చైర్మన్‌ హర్షం

పలమనేరు: ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతంపై జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశా రు. పట్టణంలో బుధవా రం ఆయన మాట్లాడు తూ పెహల్గాంలో ఉగ్రవాదులు దాష్టికాన్ని చూసి బాధపడిన ఎందరో భారతీయులకు మనసులు ఇంకా కుదటపడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యావత్తు దేశం అండగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ సైనికుల సంబరాలు

పలమనేరు పట్టణానికి చెందిన మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికులు బుధవా రం స్థానిక ఏటీఎం వద్ద సంబరాలు చేసుకున్నా రు. ఇలాంటి సమయంలో ప్రజలంతా దేశం కో సం అండగా నిలుద్దామన్నారు. ఇందులో మిల టరీ సిద్ధయ్య, మాజీ సైనికులు పాల్గొన్నారు.

సహకార బ్యాంకుల

బలోపేతానికి కృషి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): సహకార బ్యాంకుల బలోపేతానికి కృషి చేయాలని డీసీసీబీ సీఈఓ శంకరన్‌ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని డీసీసీబీ సమావేశ మందిరంలో బ్రాంచ్‌ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకుల్లో పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. ఖాతా దారుల సంఖ్యను పెంచుతూ బ్యాంకుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. పకడ్బందీగా రుణాలు ఇవ్వడంతో పాటు తిరిగి రుణాల వసూళ్లపై కూడా దృష్టి సారించాలన్నారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఆయన సూచించారు.

రేషన్‌ కార్డు దరఖాస్తులకు ఆన్‌లైన్‌లో అవకాశం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): రేషన్‌కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. బుధవారం నుంచి రేషన్‌కార్డుకు సంబంధించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తుకు ఆప్షన్‌ ఇచ్చింది. ఈ కొత్తకార్డులతో పాటు కార్డులో సభ్యుల చేరిక, సభ్యుల తొలగింపు, కార్డు విభజన, కార్డు సరెండర్‌ తప్పుడు ఆధార్‌ సీడింగ్‌ దిద్దుబాటుకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సచివాలయం వేదికగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పాత పద్ధతి, నిబంధనల ప్రకారమే కార్డులు జారీ ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. దరఖాస్తు దారులు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, ఫొటో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటే కార్డు విభజనకు అవకాశం ఉంటుందని డీఎస్‌ఓ శంకరన్‌ తెలిపారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్‌ లాగిన్‌లో అప్రూల్‌ అయినా వెంటనే కార్డులు సచివాలయంలోనే తీసుకోవచ్చన్నారు. ఇందుకు ప్రభుత్వం 21 రోజులు గడువు విడించిందని ఆయన పేర్కొన్నారు.

ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి

చిత్తూరు అర్బన్‌: అల్లూరి సీతారామరాజు ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ అన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలు అమలు చేయడంతోపాటు న్యాయాన్ని నిలబెట్టాలనే అల్లూరి జీవిత సత్యం భారతావని మరువదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ ఏఎస్పీ శివ నందకిషోర్‌, డీఎస్పీలు మహబూబ్‌ బాషా, చిన్నికృష్ణ, డీసీఆర్‌బీ సీఐ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

విప్లవ వీరుడు అల్లూరి

చిత్తూరు కలెక్టరేట్‌ : భారతదేశంలో బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని ట్రైనీ కలెక్టర్‌ నరేంద్రపాడల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహోజ్వాల శక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. సాయుధ పోరాటం చేస్తేనే స్వాతంత్య్రం వస్తుందని నమ్మిన మన్యం వీరుడు అల్లూరి అని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, కలెక్టరేట్‌ ఏఓ కులశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

– 10లో

– 10లో

న్యూస్‌రీల్‌

ఉన్నత విద్యాసంస్థలకూ సెలవులు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు లేమి ఉక్కపోతతో అల్లాడుతున్న చిన్నారులు సరిహద్దు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం సెలవులు

జిల్లాలో ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని అంగన్‌వాడీ కేంద్రా ల్లో ఫ్యాన్లు ఉన్నా ఉక్కపోతతో ఇబ్బంది పడు తున్నారు. ఫ్యాన్లు లేని చోట్ల చిన్నారుల పరిస్థి తి చెప్పనవసరం లేదు. చిన్నారులు ఉక్కపోత తాళలేక ఏడుస్తుంటే, వారిని సముదాయించలేక ఆయాలు ఇబ్బంది పడుతున్నారు. విద్యు త్‌ సరఫరా లేని సమయంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు బాధ వర్ణనాతీతంగా ఉంది. అలాగే గర్భిణులు, బాలింతలు సైతం పౌ ష్టికాహారం కోసం ఎండలోనే అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

చిన్నారుల వికాసానికి.. పూర్వప్రాథమిక విద్యకు వేదిక అయిన అంగన్‌వాడీ కేంద్రాలు సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగభగమంటున్నాడు. చిన్నారులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేడికి తాళలేక అవస్థలు పడుస్తున్నారు. విద్యుత్‌ అంతరాయం సమయంలో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అయినా కూటమి సర్కారు సెలవులు ఇవ్వకుండా వేడుక చూస్తోంది.

జిల్లాలోని అంగన్‌వాడీల సమాచారం

మెయిన్‌ అంగన్‌వాడీలు 1,795

మినీ అంగన్‌వాడీలు 625

7 నెలల నుంచి 3 ఏళ్ల బాలురు 28,783

7 నెలల నుంచి 3 ఏళ్ల బాలికలు 27,012

3– 6 సంవత్సరాల బాలురు 17,521

3– 6 సంవత్సరాల బాలికలు 17,481

మొత్తం బాల,బాలికలు 90,797

సర్కారుకు ఆ మాత్రం తెలియదా?

అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నె ల ఒకటో తేదీ నుంచి నెల రో జులు సెలవులు ఇవ్వాలని అడి గాం.ఇంతవరకు అతీగతీ లేదు. చిన్నారులు, గర్భిణులు, చిన్నా రులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం ఇళ్ల కు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. పని ఒత్తిడి తగ్గిస్తామన్నారు కానీ, ఇంకా పెంచుతూనే ఉన్నారు. జీతాల విషయంలోనూ పట్టించుకోవడం లేదు. ఎండలు మండుతున్నా అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని సర్కారుకు తెలియదా?

– ప్రేమ, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షురాలు,

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌

పొరుగు రాష్ట్రాల్లో సెలవులిచ్చారు కదా?

జిల్లా సరిహద్దులోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చారు. ఏపీలో మాత్రం వింత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదు. సెలవులు ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

– రాధమ్మ, ఏఐటీయూసీ యూనియన్‌

నాయకురాలు, ఎస్‌ఆర్‌ పురం

వేసవి సెలవుల్లో కిశోరి వికాసమట..

వేసవి సెలవుల్లో కూటమి సర్కారు కిశోరి వికాసం కార్యక్రమం చేపడుతోంది. వేసవి సెలవులు ఇవ్వకుండా ఈ కార్యక్రమం చేపడుతుండడంతో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ నెల 2 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కార్యక్రమం మంచిదే అయినప్పటికీ, వేసవి సెలవుల్లో నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు కన్వీనర్లుగా వారి కేంద్రాల పరిధిలోని కిశోరి బాలికలను సర్వే చేసి, సచివాలయాల పరిధిలో ఏఎన్‌ఎం, ఎంఎస్‌కేలతో కలిసి ప్రతి మంగళ, శుక్రవారాల్లో బడి బయట పిల్లలు, బాల్యవివాహాలు, పుట్టే బిడ్డల ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం తూతూ మంత్రంగా సాగుతోంది.

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు 1
1/6

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు 2
2/6

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు 3
3/6

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు 4
4/6

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు 5
5/6

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు 6
6/6

కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement