
● ఫలాలపై రసాయన పంజా ● కార్భైడ్ వినియోగంతో విషపూరితం
పలమనేరు: ఆరోగ్యం కోసం పండ్లు తింటుంటే వాటి మాటున విషం పొంచి ఉంటుంది. మార్కెట్‌ల్లో ప్రస్తుతం పలు రకాల పండు సరసమైన ధరల్లో లభిస్తుండడంతో కొనడానికి, తినడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే వారు మాత్రం ఆలోచిస్తున్నారు. పలు రకాల కాయలను మాగబెట్టడానికి విచ్చల విడిగా రసాయనాలు వాడుతుండడమే ఇందుకు కారణం.
కనిపించని సహజపద్ధతులు
గతంలో కాయలు మాగబెట్టేందుకు సహజసిద్ధంగా ఊదర ప్రక్రియ, బోద కసువులో పెట్టి మాగబెట్టే పద్ధతులు ఇప్పుడు కనిపించడం లేదు. జిల్లాలోని పలు పట్టణాల్లో నిర్ణీత రుసుం చెల్లిస్తే పచ్చి కాయలను రసాయనాలతో మాగబెట్టే గోడౌన్‌లున్నాయి. గోడౌన్‌కు తరలించిన పచ్చి కాయలు 24 గంటల్లోపు పండ్లుగా మారుతున్నాయి.
ప్రమాదకర రసాయనాలతో...
గోడౌన్‌కు తరలించిన అరటి, మామిడి కాయలను మొదట మ్యాంకోజబ్–45 అనే పౌడర్‌ను ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటరు చొప్పున వేస్తారు. ఆ నీటిలో ఈ పచ్చి కాయలను ముంచి పక్కన బెడతారు. తర్వాత ఎథిలిన్, కాల్షియం కార్బైడ్ తదితర బిళ్లలు, రసాయనాలను నీటిలో వేస్తే దాని నుంచి గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓ గదిలో కాయలను ఉంచి ఈ గ్యాస్‌ను వదిలి ఆ గదిలోకి గాలిపోకుండా చేస్తారు. మరోవైపు వేపర్ ట్రీట్‌మెంట్ పేరిట కాయలను బందీ చేసిన గదుల్లోకి విషపూరితమైన మిథైల్ గ్యాస్‌ను వదిలి పెడతారు. దీంతో 24 గంటల్లోకి పచ్చి కాయలకు సైతం మంచి రంగు వచ్చి పండ్లుగా మారుతున్నాయి. మరికొంత మంది ఇంజెక్షన్‌ల ద్వారా కాయల్లోకి రసాయనాలు పంపి, మాగబెడుతున్నారు.
కాల్షియం కార్భైడ్ అమ్మకాలపై నిషేధమున్నా...
జిల్లాలో 8 వేల వరకు పండ్ల దుకాణాలున్నాయి. అలాగే 80 వరకు రీపినింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో విషపూరితమైన రసాయనాలతో మాగబెట్టిన పండ్లను దుకాణాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నా వీరిపై చర్యలు లేవు. పట్టించుకునేవారే కరువయ్యారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఆహార కల్తీ నిరోధక శాఖ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వారు అసలు పట్టించుకోవడం లేదు.
మోతాదుకు మించి రసాయనాల వాడకం
ఏ పంటను పండించినా అవరసమైన మోతాదులోనే రసాయనిక మందులను పిచికారీ చేయాలి. అయితే రైతులకు దీనిపై అవగాహన లేక పంట బాగా రావాలని అనవరసంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో ప్రకృతి పాడవడంతోపాటు మనిషికి లేనిపోని రోగాలు వస్తున్నాయి. అందుకే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం.
–మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయఅధికారి, చిత్తూరు
రోగాలను కొని తెచ్చుకున్నట్టే...
పండు రంగు చూసి ఆశపడి కొని తింటే రోగాన్ని తెచ్చుకున్నట్టే. రసాయనాలతో మాగబెట్టిన పండ్ల తినడంతో అది విడుదల చేసే ఆర్సెసినిక్ యాసిడ్ కారణంగా కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. సీజన్‌లో దొరికే సహజసిద్ధంగా మాగబెట్టిన పండ్లను తినడం మేలు.
– మమతారాణి,
ఏరియా ఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరు
కార్భైడ్‌తో మాగబెడితే చర్యలు తప్పవు
మామిడి కాయలను రసాయనాల ద్వారా మాగబెట్టడంపై నిషేధం ఉంది. కార్భైడ్‌ను వినియోగించినట్టు తనిఖీల్లో తేలితే మూడేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా తప్పదు. సహజపద్ధతిలోనే మామిడిని మాగించాలి. మామిడిని మాగబెట్టే సెంటర్లను ఇప్పటికే మార్కెటింగ్, హార్టికల్చర్, సచివాలయ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అవసరమైతే మామిడి మార్కెట్‌లో పండ్లను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల ద్వారా రసాయనాలపై టెస్ట్‌లు చేయిస్తాం.
– విధ్యాధరి, జేసీ, చిత్తూరు
●

● ఫలాలపై రసాయన పంజా ● కార్భైడ్ వినియోగంతో విషపూరితం

● ఫలాలపై రసాయన పంజా ● కార్భైడ్ వినియోగంతో విషపూరితం

● ఫలాలపై రసాయన పంజా ● కార్భైడ్ వినియోగంతో విషపూరితం

● ఫలాలపై రసాయన పంజా ● కార్భైడ్ వినియోగంతో విషపూరితం

● ఫలాలపై రసాయన పంజా ● కార్భైడ్ వినియోగంతో విషపూరితం

● ఫలాలపై రసాయన పంజా ● కార్భైడ్ వినియోగంతో విషపూరితం