
ఎర్రచందనం దుంగలు సహా కారు సీజ్
తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతోపాటు కారును సీజ్ చేసినట్టు తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో వివేక్‌కు అందిన రహస్య సమాచారం మేరకు మామండూరు బీట్ పరిధిలో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించినట్టు తెలిపారు. దుండగులు కారును వదిలేసి వెళ్లిపోయారని, అందులో పరిశీలించగా 26 ఎర్రచందనం దుంగలు ఉన్నాయని తెలిపారు. కారుతో పాటు ఎర్రచందనం దుంగలను సీజ్ చేసినట్టు వివరించారు. తనిఖీల్లో ఎఫ్‌ఆర్‌వో సుదర్శన్‌రెడ్డి, డీఆర్‌వో గౌస్ కరీమ్, ఎఫ్‌బీవోలు శరవణకుమార్, జాన్ శ్యామ్యూల్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
మామిడి తోటకు నిప్పు
శ్రీరంగరాజపురం : మండలంలోని ఎగువ కమ్మకండ్రిగలో భాస్కర్‌నాయుడు అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల మామిడి తోటకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 250 మామిడి చెట్లతోపాటు డ్రిప్ సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు వెల్లడించారు. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ప్రభుత్వ స్పందించి తను ఆదుకోవాలని కోరారు.

ఎర్రచందనం దుంగలు సహా కారు సీజ్