జిల్లా జడ్జి భీమారావు సేవలు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జి భీమారావు సేవలు స్ఫూర్తిదాయకం

Apr 14 2025 12:26 AM | Updated on Apr 14 2025 12:26 AM

జిల్లా జడ్జి భీమారావు సేవలు స్ఫూర్తిదాయకం

జిల్లా జడ్జి భీమారావు సేవలు స్ఫూర్తిదాయకం

చిత్తూరు అర్బన్‌ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు సేవలు స్ఫూర్తిదాయకమని స్థానిక మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో బదిలీ అయిన భీమారావును సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రమేష్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భీమారావు అందరికీ ఆదర్శమని కొనియాడారు. అనంతరం భీమారావును న్యాయమూర్తులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్‌, 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు, ఎరచ్రందనం కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి, న్యాయసేవాసదన్‌ జిల్లా కార్యదర్శి భారతి, న్యాయమూర్తులు పద్మజ, వెన్నెల, ఉమాదేవి, శ్రీనివాస్‌, బాబ్‌జాన్‌, న్యాయమూర్తులు పాల్గొన్నారు. అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావును కోర్టు అధికారులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పరిపాలనాధికారి నిర్మల అధికారులు, ఉద్యోగుల పాల్గొన్నారు.

నేడు పోలీసు గ్రీవెన్స్‌ రద్దు

చిత్తూరు అర్బన్‌ : అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అలాగే నగరపాలక సంస్థలో కూడా వేదికను వాయిదా వేస్తూ నగర కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement