జిల్లా ప్రభుత్వ బడుల సమాచారం బడులకేటగిరి పాఠశాలలు విద్యార్థుల సంఖ్య ప్రైమరీ 1902 64,519 అప్పర్ ప్రైమరీ 204 45,800 హైస్కూల్స్ 330 30,898 మొత్తం 2,436 1,41,217
పలమనేరు : ఏం చదువులోగానీ చిన్నారులకు మాత్రం బండెడు పుస్తకాల మోత తప్పడం లేదు. ఆడుతూ.. పాడుతూ ఉండాల్సిన వయస్సులో పిల్ల లకు బ్యాగుల భారం శరాఘాతంలా మారిందని తల్లిదండ్రులు ఎన్నాళ్లుగానో ఆవేదన చెందుతు న్నారు. జాతీయ విద్యా విధానం అమలై నాలుగేళ్లైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌డే’ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. నో బ్యాగ్ డేన పిల్లలకు క్విజ్ పోటీలు, డిబేట్లు, క్రీడలు, క్షేత్రస్థాయి పర్యటనలు తదితర సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
పుస్తకాల భారం తగ్గించాలనే లక్ష్యం
చిన్నారుల బరువులో పది శాతానికి మించి బరువు మోయరాదనే నిపుణుల మాటలను ఇప్పటి దాకా అటు పాఠశాలల యాజమాన్యాలు, ఇటు తల్లిదండ్రులు అసలు పట్టించుకోలేదు. చిన్నారుల పుస్తకాల మోతపై గతంలో అధ్యయనం చేసిన యశ్‌పాల్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. 1 నుంచి 5 తరగతులకు మూడు కిలోలకు మించి బరువు మోయించరాదని, పదో తరగతికి ఐదు కిలోల వరకే బరువు ఉండాలని సూచించారు.
ఇకపై సెమిష్టర్ విధానం
పిల్లల భుజాలపై పుస్తకాల భారాన్ని తగ్గించేందకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బడుల్లో సెమిష్టర్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆ సెమిష్టర్‌కు సంబంధించిన రెండు పుస్తకాలు, నోట్స్‌లను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటి దాకా నెలలో మూడో శనివారం మాత్రమే
ఇకపై ప్రతి శనివారం నో స్కూల్ బ్యాగ్ అమలు
పిల్లలచే సృజనాత్మకను పెంపొందించే కార్యక్రమాలు
మంచి నిర్ణయం అంటున్న మేధావులు, తల్లిదండ్రులు