కేజీబీవీలు..
● ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ● ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోర్సులు ● కార్పొరేట్‌కు దీటుగా మౌలిక వసతులు
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలు, అనాథ బాలికల చదువుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) బాసటగా నిలుస్తున్నాయి. ఉచిత వసతితో పాటు భోజనంతో కూడిన విద్యను అందిస్తున్నాయి. తాజాగా కేజీబీవీల్లో 6వ తరగతితో పాటు ఇంటర్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీ గడువు విధించారు. అర్హులైన బాలికలు 6వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు పొందవచ్చు.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం, బైరెడ్డిపల్లి, గంగవరం, పుంగనూరు, రొంపిచెర్లలలో కేజీబీవీలు ఉన్నాయి. సీట్ల భర్తీలో నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వారీగా ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం సీట్లను భర్తీ చేస్తారు. 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు ఉంటాయి. ఒక్కో తరగతికి 40 సీట్ల చొప్పున కేటాయించారు. దరఖాస్తులను హెచ్‌టీటీపీఎస్://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్‌వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్‌న్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది.
ప్రత్యేకత ఇదీ....
ఈ విద్యాలయాల్లో చేరిన బాలికలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారం అందిస్తారు. మెరుగైన వైద్య సదుపాయం, వృత్తి విద్యలో శిక్షణ అందిస్తారు. చదువుతోపాటు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, నృత్యం, సంగీతం వంటివాటిని నేర్పిస్తారు. తరగతి గదుల్లో ఎల్‌సీడీ ప్రాజెక్టర్లు, డీవీడీ ప్లేయర్ల ద్వారా బోధన ఉంటుంది. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
నిరంతర పర్యవేక్షణ
కేజీబీవీ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యా బోధన సాగు తుంది. మౌలి కసదుపాయాలు, విద్యార్థు లకు స్మార్ట్ డిజిటల్ తరగతులు ద్వారా బోధన ఉంటుంది. బాలికలకు భరోసాగా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. – వెంకటరమణ, జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, చిత్తూరు
పురోగతికి సోపానం
జిల్లాలోని కేజీబీవీలు పేద విద్యార్థినుల పు రోగతికి సోపానాలు, కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థినులు అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆన్‌న్‌లైనన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.
– వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు
బాలికలకు వరం