
నవోదయ ఫలితాల్లో విశ్వం విద్యార్థుల విజయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఆ మేరకు ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు విక్రమ్, గోపిక, జీవన్‌సాయిరెడ్డి, శరత్‌చంద్ర, నవదీప్ యాదవ్, జాహ్నవి, జస్వంత్, మిథున్ మిహాల్, నితీష్‌సాయి, సోహిని, అభ్యుదయతోపాటు మొత్తం 37 మంది నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. 35 ఏళ్లుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్ తదితర ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడం తమకు గర్వకారణమని తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్ ఎన్.తులసీ విశ్వనాథ్ అభినందించారు.