చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో ఇటీవల ఆర్‌ఐ కేడర్ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌గా పలువురికి ఉద్యోగోన్నతి లభించింది. వారందరికీ పోస్టింగ్‌లు ఇస్తూ మంగళవారం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు.
ఆ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ సీసీగా పనిచేస్తున్న యుగేష్‌కు (పెద్దపంజాణి డిప్యూటీ తహసీల్దార్), కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌కు (ఇనామ్ డిప్యూటీ తహసీల్దార్, కలెక్టరేట్), డీఎస్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్‌కు (ఎన్నికల డీటీ, పుంగనూరు), పలమనేరులో పనిచేస్తున్న నందినిదేవికి (డిప్యూటీ తహసీల్దార్, చౌడేపల్లి), కలెక్టరేట్‌లో పనిచేస్తున్న రేఖకు (సీఎస్‌డీటీ, కుప్పం), కలెక్టరేట్‌లో పనిచేస్తున్న జోసఫ్‌కు (ఈడీటీ, కుప్పం), డీఎస్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న శిరీషాకు (సీఎస్‌డీటీ, పలమనేరు), గంగవరంలో పనిచేస్తున్న నరేంద్రకు (రీసర్వే డీటీ, కుప్పం), కలెక్టరేట్‌లో పనిచేస్తున్న శోభకు (రీ సర్వే డీటీ, వి.కోట), బంగారుపాళ్యంలో పనిచేస్తున్న మధుసూదన్‌కు (డిప్యూటీ తహసీల్దార్, సోమల)లో పోస్టింగ్‌లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టింగ్‌లు పొందిన డీటీలు వెంటనే నూతన స్థానాల్లో విధుల్లో చేరాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డీఎస్సీ ఉచిత శిక్షణ కేంద్రం మంజూరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సొంత జిల్లాలో డీఎస్సీ కేంద్రం మంజూరు చేయలేదనే అంశంపై ఈనెల 14 వ తేదీన సాక్షిలో ‘భవితవ్యం..అయోమయం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లా కేంద్రంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మిట్టూరులో ఉన్న కుట్టి స్టడీ సర్కిల్‌ను ఉచిత శిక్షణ కేంద్రంగా ప్రకటిస్తూ ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.