
ఎంపీపీలపై ధిక్కారం
సమస్యలు ఆ ఇద్దరి ఎంపీపీలవే కాదు.. దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో అదే పరిస్థితి నెలకొంది. న్యాయం చేయాల్సిన మండల అధికారులు కూటమి నేతలతో కుమ్మకై ్క ఎంపీపీ, ఎంపీటీసీలకు కనీస విలువలు ఇవ్వడం లేదు. వీటిపై నిలదీస్తే కూటమి ఎమ్మెల్యేలు చెప్పిందే చేస్తున్నట్లు ఎంపీడీఓలు వెల్లడిస్తున్నారని ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ /చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎంపీపీ (మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్)కు పది నెలలుగా తగిన గౌరవం దక్కడం లేదు. మండల అభివృద్ధిలో ఎంపీపీల పాత్ర ఎంతో కీలకం. అలాంటి ఎంపీపీలకు టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మర్యాద ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల్లో కీలకంగా వ్యవహరించే ఎంపీపీల నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇదేమిటని అడిగితే అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారు...బెదిరిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎంపీపీల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులను జరగనివ్వకుండా అడ్డుకుంటున్నా రు. పది నెలలుగా ఇదే తంతు జరుగుతోందని ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ అభివృద్ధి పనుల వివరాలు అడిగినా ఎంపీడీఓలు కూటమి ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవాలని, ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీలు.. కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడును కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆటంకాలు సృష్టిస్తున్న ‘కూటమి’
ఎంపీపీల హక్కులు, గౌరవానికి, అధికారాలను కూటమి టీడీపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఎంపీపీల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ హనుమంతరావు ఆరోపించారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పతో కలిసి ఎంపీపీ, వైస్ ఎంపీపీలు మంగళవారం జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం పది నెలలుగా క్షేత్ర స్థాయిలోని మండలాల్లో ఎంపీపీలకు జరుగుతున్న అన్యాయాలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సుదీర్ఘంగా జెడ్పీ సీఈఓతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ, నాయకులు మోహన్, అమరావతి, సురేష్, భార్గవి, సురేంద్రరెడ్డి, యశ్వంత్, జయరాం, శివారెడ్డి, డి.సురేష్, త్యాగ, సంపత్, రాజశేఖర్, మునిలక్ష్మి, గుణశేఖర్‌రెడ్డి, తులసి తదితరులు పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయిలో కక్ష సాధింపులు
కూటమి టీడీపీ పాలనలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం దక్కడం లేదని ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక సమావేశాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీపీల అధికారాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
ప్రతి పనికి ఎమ్మెల్యే అనుమతులు..
గ్రామాల్లో ఏ చిన్న పని చేయాలన్నా కూటమి టీడీపీ ఎమ్మెల్యే అనుమతి కావాలని ఎంపీడీఓలు చెబుతున్నారన్నారు. ఇలాంటి ధోరణి గతంలో ఎన్నడూ లేదన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల ఎంపీడీఓలు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీలకు సంబంధించి అభివృద్ధి పనుల వివరాలు, చేపడుతున్న పనుల వివరాలు, సమావేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదన్నారు. మరికొందరు ఎంపీడీఓలైతే ఏకంగా పర్సంటేజీలు అడుగుతున్నట్లు తెలిపారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఆమోదించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గ్రామాల్లో చిన్న పనులు చేయాలన్నా ఎంపీడీఓలు ఇబ్బందులు పెడుతున్నారని జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశారు.
కూటమి ప్రభుత్వంలో హక్కులు నిర్వీర్యం
ఎటువంటి సమాచారం ఇవ్వని వైనం
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు
పలు మండలాల ఎంపీడీఓలు నియంతలుగా వ్యవహారం
పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ దృష్టికి ఎంపీపీల సమస్యలు
ప్రధాన డిమాండ్లు ఇవే..
ప్రభుత్వ అధికారులు ఎంపీపీల విషయంలో ప్రొటోకాల్ పాటించాలి
ఎంపీపీల నిధుల విషయంలో పాలకవర్గం అనుమతి లేకుండా ఎంపీడీఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారి పోకడలను నియంత్రించాలి
ఎంపీపీ, పాలకవర్గం తీర్మానించిన అభివృద్ధి పనులు అమలు చేయకుండా , ప్రొసీడింగ్స్, వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా దురుద్దేశంతో కాలయాపన చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఎంపీపీ నిధుల్లో చేపట్టే పనులకు పంచాయతీ తీర్మానం కావాలని అధికారులు చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు.
ఎంపీపీలకు వాహన అలవెన్సు, గౌరవ వేతనం ఇవ్వడం లేదు.
అధికారులు వేధిస్తున్నారు
మండలంలో తీర్మానించిన పనులను చేసుకోవాలంటే జిల్లాలో కష్టంగా మారింది. అధికారు లు నియంతలా వ్యవహరిస్తున్నారు. వీటిపై అన్ని సమావేశాల్లో తెలియజేసినా మార్పు రావడం లేదు. – రెడ్డెప్ప, జిల్లా అధ్యక్షుడు ఎంపీపీల సంఘం
న్యాయపరంగా పోరాడుతాం
ఎంపీడీఓలు ఎమ్మెల్యేల పేరుతో ఏకపక్షంగా వ్య వహరిస్తున్నారు. తీర్మానించిన పనులు చేయకు ండా నేతలు చెప్పిన పను లు చే స్తున్నారు.న్యాయపరంగా పోరాటం చేస్తాం. – హనుమంతరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎంపీపీల సంక్షేమ సంఘం
సగం–సగం అంటున్నారు
మండలంలో మా నిధులతో జరిగే పనులను కూటమి నాయకులకు స గం కేటాయించాలని అధికారులు చెప్పడం బాధాకరం. అభివృద్ధి పనులను నా అమనుతి లేకుండా చేపట్టారు. వీటిని ప్రశ్ని స్తే ప్రస్తుతానికి ఆపారు. – భార్గవి, ఎంపీపీ నగరి

ఎంపీపీలపై ధిక్కారం

ఎంపీపీలపై ధిక్కారం

ఎంపీపీలపై ధిక్కారం