● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్యలపై వెల్లువెత్తుతున్న అర్జీలు ● క్షేత్రస్థాయిలో పట్టించుకోని అధికారులు ● మాయమాటలతో ఎండార్స్‌మెంట్‌పై సంతకాలు ● చిత్తశుద్ధి లేని ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న జిల్లా వాసులు ● సాక్షి విజిట్‌లో వెల్లడైన | - | Sakshi
Sakshi News home page

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్యలపై వెల్లువెత్తుతున్న అర్జీలు ● క్షేత్రస్థాయిలో పట్టించుకోని అధికారులు ● మాయమాటలతో ఎండార్స్‌మెంట్‌పై సంతకాలు ● చిత్తశుద్ధి లేని ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న జిల్లా వాసులు ● సాక్షి విజిట్‌లో వెల్లడైన

Mar 18 2025 12:43 AM | Updated on Mar 18 2025 12:41 AM

గత పది నెలలుగా కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీల వివరాలు

రెవెన్యూ: 22,470

సర్వే శాఖ: 15,977

పోలీస్‌: 2,118

హౌసింగ్‌: 756

మున్సిపల్‌: 558

సివిల్‌ సప్లయిస్‌: 524

పీఆర్‌ ఇంజినీరింగ్‌: 441

పంచాయతీరాజ్‌: 399

సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌

ఆఫ్‌ రూరల్‌ పావర్టీ: 372

ఎస్పీడీసీఎల్‌: 334

పశుసంవర్థకశాఖ: 296

ఆర్‌డబ్ల్యూఎస్‌: 231

దేవదాయశాఖ: 171

గ్రామీణాభివృద్ధి: 126

పబ్లిక్‌ హెల్త్‌: 125

వాటర్‌ రీసోర్స్‌: 122

సోషల్‌ వెల్ఫేర్‌: 113

ఇతర శాఖలు: 677

మొత్తం: 45,810

పొలం బాట కబ్జా చేశారు.. న్యాయం చేయండి. బతకడమ కష్టంగా ఉంది.. పింఛన్‌ ఇప్పించండి. దాహార్తితో అలమటిస్తున్నాం.. నీరు అందించండి. పంట కాలువను పూడ్చేశారు.. చర్యలు తీసుకోండి. శ్మశానం అధ్వాన్నంగా ఉంది.. కనీస సౌకర్యాలు కల్పించండి. కనిపెంచిన బిడ్డలు తరిమేశారు.. ఆదుకోండి. ఇలా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అధికారు ల వైపే చూస్తుంటారు. ఒక్క అర్జీ ఇస్తే తమ కష్టం తీరిపోతుందని నమ్ముతుంటారు. అయి తే క్షేత్రస్థాయిలో జనం ఆశలు నెరవేరడం లేదు. మండలస్థాయిలో పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్‌కు వెళ్లినా ఫలితం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం నిర్వ హించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక ప్రహ సనంగా మారిపోయింది. బాధితులు అందించే వినతులకు అతీగతీ లేకుండా పోతోంది.

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 45,810 అర్జీలు వచ్చాయి. ఇందులో 32,900 పరిష్కరించినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మాత్రం వినతులు పెరుగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తూతూమంత్రంగా ప్రజల అర్జీలకు సమాధానం ఇస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేసిన పలువురు అర్జీదారులే వెల్లడించారు. మండల స్థాయి అధికారులు ఏ మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దూరాభారం అయినా ప్రతి సోమవారం చిత్తూరుకు వస్తున్నట్లు వాపోతున్నారు.

ఒక్కొక్కరిది..ఒక్కో ఆవేదన

జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు వందల సంఖ్యలో విచ్చేస్తున్నారు. ప్రతి వారం వచ్చిన వారే మళ్లీ వస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రీవెన్స్‌లో సమస్యలు వెల్లడిస్తున్న వారిలో ఒక్కొక్కరిది...ఒక్కొక్క ఆవేదన. అధికారులు కరుణించపోవడంతో చేసేదేమి లేక ప్రజలు వినతులను పలుమార్లు ఇస్తూనే ఉన్నారు.

ఏమార్చి సంతకం చేయించుకుని..

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చేచ ప్రతి అర్జీని అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఒక్కొక్క సమస్యను బట్టి నిర్ణీత గడువు ఉంటుంది. ఆ లోపు సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే అధికారులు అలా చేయకుండా అర్జీదారులను ఏమారుస్తున్నారు. పరిష్కార తేదీ సమీపంలో వారిని కార్యాలయాల వద్దకు పిలిపించి మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకుంటున్నారు. తర్వాత అర్జీ పరిష్కరించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కూటమి టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈతతంగమే సాగుతోంది.

ఏదీ పరిష్కారం

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పది నెలల్లో ఇప్పటి వరకు 32,824 పరిష్కరించామని కలెక్టరేట్‌ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మిగిలిన 12,880 అర్జీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లువ వెల్లడిస్తున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు లెక్కలే అని క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

సౌకర్యాలు కల్పించాలి

మాది కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం పీఎంకే తాండా. మా కాలనీలో 1,200 మంది నివాసముంటున్నాం. మా కాలనీకి సమీపంలో ఉన్న శ్మశానంలో మౌలిక వసతులు లేవు. ఎవరైనా మృతి చెందితే శ్మశానానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మేరకు మౌలిక వసతులు కల్పించాలని చాలా సార్లు వినతులిచ్చాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. – ధనపాల్‌ నాయక్‌, మూర్తి నాయక్‌, పీఎంకే తాండా వాసులు

శ్మశాన స్థలంలో బోరు వేస్తున్నారు

మాది కార్వేటి నగరం మండలం కేశవకుప్పం ఎస్టీ కాలనీ. సర్వే నంబర్‌ 18లో శ్మశానవాటికకు ఎకరా భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ శ్మశాశాన్ని ఎస్టీ కాలనీ వాసులు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి అక్రమంగా ఈ స్థంలో బోరు వేసుకుంటున్నాడు. దీంతో అధికారులను ఆశ్రయించాం. శ్మశానానికి హద్దులు గుర్తించి ప్రహరీగోడ, సీసీ రోడ్డు వేయించాలని కోరాం. న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

– వెంకటరామయ్య, జయరామయ్య, కేశవకుప్పం గ్రామస్తులు

భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా!

మాది యాదమరి మండలం కృష్ణపల్లె. మా గ్రామంలో నివాసముండేందుకు గాను కాస్త భూమి నా పేరుతో ఉంది. నేను వృద్ధాప్యంలో ఉండడంతో ఆ భూమిని మరొకరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అడిగినందుకు బెదిరిస్తున్నారు. మా మండల తహసీల్దార్‌ కు సమస్య చెప్పినప్పటికీ న్యాయం చేయలేదు. కలెక్టర్‌కు సమస్య చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని ఇంత దూరం వచ్చా.

– కస్తూరి, వృద్ధురాలు, యాదమరి మండలం.

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య1
1/6

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య2
2/6

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య3
3/6

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య4
4/6

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య5
5/6

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య6
6/6

● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement