‘కాసు’క్కూర్చున్న ఖాకీ! | - | Sakshi
Sakshi News home page

‘కాసు’క్కూర్చున్న ఖాకీ!

Mar 18 2025 12:39 AM | Updated on Mar 18 2025 12:38 AM

● పోలీస్‌స్టేషన్‌లోనే యథేచ్ఛగా లావాదేవీలు ● ధనార్జనే ధ్యేయంగా విధులు ● ఆఖరుకు దొంగల నుంచి కూడా రూ.లక్షలు వసూలు ● చిత్తూరులో వివాదాస్పదంగా ఓ పోలీస్‌ అధికారి తీరు

చిత్తూరు అర్బన్‌ : పోలీస్‌ వృత్తి నిబద్ధతతో కూడుకుంది. శాంతిభద్రతల రక్షణతో ముడిపడింది. ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించేలా భరోసా కల్పిస్తుంది. అలాంది ఉన్నతమైన శాఖలో పనిచేస్తున్న ఓ ఖాకీ తీరు ప్రతిష్టాత్మక వ్యవస్థ పరువును మంటగలుపుతోంది. రక్షకభటులకు ఆలయంతో సమానమైన స్టేషన్‌ను అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా మార్చేయడం విమర్శలకు తావిస్తోంది. ఘనత వహించిన సదరు పోలీసు అధికారి అవినీతి చిట్టా నుంచి ఒక్కొక్కటి బయటకు రావడం జిల్లా పోలీస్‌శాఖను కుదిపేస్తోంది. ఘనత వహించిన అధికారి పద్దులో నుంచి మచ్చుకు కొన్ని..

● ఎవరైనా బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నామని స్టేషన్‌కు వెళితే, లాఠీ ఎత్తుకుని మరీ తరుముకుంటున్నాడు. శ్రీఏయ్‌, ఆ కథలన్నీ నాకు చెప్పొద్దు. ఎక్కడో పోగొట్టుకుని నా స్టేషన్‌కు వస్తావా? పో బయటికిశ్రీ అంటూ వెంటపడే ఆ అధికారి.. బెంగళూరులోని ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో పోగొట్టుకున్న నగల ఘటనపై చిత్తూరులో కేసు నమోదు చేయడం విడ్డూరమే మరి.

● నాలుగు నెలల క్రితం చిత్తూరు నగరంలోని ఓ స్థలానికి సంబంధించిన సివిల్‌ గొడవల్లో కూటమి పార్టీకి చెందిన ఓ నేత, అదే పార్టీ సానుభూతిపరుడైన మరో చోటా నేత రోడ్డెక్కి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. అప్పటికే చోటా నేత నుంచి రూ.5 లక్షలు తీసుకున్న ఆ అధికారి.. కనీసం కేసు కూడా నమోదు చేయలేదనే ఆరోపణలున్నాయి.

● ఓ ఇంట్లో తాపీ పనికివచ్చిన వ్యక్తి ఇటీవల పనిచేస్తూ మిద్దైపెనుంచి పడి మృతి చెందాడు. వాస్తవానికి ఈ ఘటనపై ఇంటి యజమానిని పిలిపించి..ఆ మరణానికి నువ్వే కారణం, నీపై కేసు నమోదుస్తున్నా.. అని చెప్పి, తర్వాత 195 సెక్షన్‌ కింద కేసు మార్చేశారని స్టేషన్‌ సిబ్బందే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. దీనికి ప్రతిఫలంగా రూ.3 లక్షలు ఇంటి యజ మాని నుంచి ఆ ఖాకీ నొక్కేసినట్లు చెబుతున్నారు.

● ఫిబ్రవరి ఓరోజు రాత్రి తప్పతాగిన సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు కారు నడుపుతూ, వేరే కారులో ముందు వెళుతున్నవాళ్లను భయబ్రాంతులకు గురిచేశాడు. నడిరోడ్డుపై అవతలివాళ్ల కారు అడ్డగించి, అందర్నీ కిందకు దించి కారును తనిఖీ చేశాడు. ప్రాణభయంతో స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తే డ్రంక్‌ డ్రైవ్‌ కింద ఫైన్‌ కట్టించి నిందితుడిని వదిలేశాడు. ప్రతిఫలంగా ఆ సంపన్న యువకుడి నుంచి రూ.1.50 లక్షల లంచం తీసుకున్నాడనే ఆరోపణలూ గుప్పుమన్నాయి.

● ఇక పలువురు మద్యం దుకాణాల యజమానులను స్టేషన్‌కు పిలిపించి నెలసరి మామూళ్లు డిమాండ్‌ చేయ డం ఆయనకే చెల్లు. అక్రమంగా ఇసుక తరలింపు, పర్మిట్‌లేని గ్రానైట్‌ లారీలు, క్రికెట్‌ బెట్టింగులు నిర్వహించే వారి నుంచి నెలసరి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు స్టేషన్‌ మొత్తం కోడై కూస్తోంది.

● ఇటీవల రాయచోటిలో పట్టుబడ్డ ఓ దొంగ.. శ్రీసార్‌, చిత్తూరులోని ఓ పోలీస్‌ అధికారికి రూ.12.5లక్షలు లంచంగా ఇచ్చా. మీకు ఎంత కావాలి..?శ్రీ అంటూ సవాల్‌ విసిరాడు. చోరీ కేసులో దొంగతో చేతులుకలిపిన సదరు ఖాకీ, భారీగా సొమ్ములు బొక్కేసినట్లు చెప్పుకుంటున్నారు. స్టేషన్‌లో పనిచేసే ముగ్గురు కానిస్టేబుళ్లు జరిగింది వాస్తవమంటూ ఓ అధికారి ఎదుట అంగీకరించడంతో.. వారిపై బెదిరింపులకు దిగినట్లు విమర్శలున్నాయి.

● ఇన్ని ఆరోపణలున్నా.. ఆ అధికారి చెప్పే ఫైనల్‌ మాట... శ్రీబాసుశ్రీ నన్ను డైరెక్ట్‌గా తెచ్చుకున్నాడు. ఆయన వద్దకు వెళితే నాకిచ్చే మర్యాదే వేరు. ఈ మధ్య ఉన్నతాధికారి చేసిన ఓ పనికిమాలిన పనికి బాస్‌ ఫైర్‌ అయ్యాడు. నేనువెళ్లి నచ్చచెప్పాకా వదిలేశాడు. లేదంటే ఆ అధికారి అవుట్‌.. ఎవ్వడూ నన్నేం చేయలేడు..శ్రీశ్రీ అని చెప్పడం ఆయనకే చెల్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement