ట్రాన్స్‌‘ఫార్మర్‌’కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌‘ఫార్మర్‌’కష్టాలు

Mar 17 2025 12:30 AM | Updated on Mar 17 2025 12:30 AM

ట్రాన

ట్రాన్స్‌‘ఫార్మర్‌’కష్టాలు

● కాలిపోతున్న వాటికి మరమ్మతులు కరువు ● 2 నెలలుగా ప్రారంభం కానీ ఓఆర్‌ఎం ● ముగియనున్న వారంటీ గడువు ● పేమేంట్‌ పెండింగ్‌తో ఆగిన ఇన్‌స్టాలేషన్‌

ముగియనున్న వారంటీ గడువు

ఆగస్టు నాటికి ఓఆర్‌ఎం గడువు ముగియనున్నది. ఇంకా ఇన్‌స్టాల్‌ కూడా కాలేదు. వాటిని వినియోగించి మరమ్మతు సమస్యలు వస్తే అప్పుడు వారంటీతో ఉచితంగా సేవలు పొందవచ్చు. ఆగస్టు నెల ముగిస్తే సేవలకు పైకం చెల్లించాల్సి వస్తుంది. వాటికి ఆర్థికంగా అనుమతులు వచ్చే వరకు పడిగాపులు కాయాలి. గత ప్రభుత్వంలో 90 శాతం వరకు డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం పది శాతం పెండింగ్‌లో ఉన్న మొత్తంను చెల్లించాలి. ఏనుగంతా చెల్లించి తోక మాత్రం కట్టలేను అన్న చందంగా మారింది. ఆ డబ్బులు చెల్లించపోవడంతో టెక్నీషియన్లు ఇన్‌స్టాల్‌ చేయడానికి రావడం లేదని తెలుస్తోంది.

చిత్తూరు కార్పొరేషన్‌ : ఎండలు మండుతున్నాయి.. పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యుత్‌ పరికరాల వినియోగం పెరిగింది. ఓవర్‌ లోడ్‌తో జిల్లాలో వ్యవసాయ, నివాస ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ బాగు చేయడానికి (రీజనరేషన్‌) తెచ్చిన నూతన ఓఆర్‌ఎం మిషన్‌ ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. పేరు ఘనం ఆచరణ శూన్యం అన్నట్లు మారింది అధికారుల తీరు. ట్రాన్స్‌కో అధికారుల చొరవ చూపి మిషన్‌ను ఇన్‌స్టాల్‌ చేయకపోతే వేసవిలో తిప్పలు తప్పవు. రెండు నెలలుగా టెక్నీషియన్‌ రాకపోవడంతో మిషన్‌ అలంకారప్రాయంగా చిత్తూరులోని ఎస్‌పీఎంలో ఉంది. వారంటీ గడువు దగ్గర పడింది. గత ప్రభుత్వం 90 శాతం నిధులు చెల్లించింది. ప్రస్తుతం పది శాతం నిధుల పెండింగ్‌తో ఇన్‌స్టాలేషన్‌ ఆగింది.

2 నెలలుగా ప్రారంభం కానీ ఓఆర్‌ఎం

డిస్కం (రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) పరిధిలో మొట్టమొదట సారిగా చిత్తూరుకు ఎస్‌పీఎం (స్పెషల్‌ మెయింటెన్స్‌)కు ఓఆర్‌ఎం (ఆయిల్‌ రీజనరేషన్‌ మిషన్‌)ను కేటాయించారు. తొలుత వీటిని తిరుపతి జిల్లా రేణిగుంటకు మంజూరు చేసినా అక్కడ ఎస్‌పీఎం మరమ్మతు పనులు జరుగుతుండటంతో కొత్తగా ఏర్పడిన ట్రాన్స్‌కో చిత్తూరు జిల్లాకు వీటిని బదిలీ చేశారు. దాదాపు రూ.50 లక్షల వ్యయంతో డిస్కంలో మోడల్‌గా మొట్ట మొదటి ఓఆర్‌ఎంను జనవరిలో చిత్తూరు ఎస్‌పీఎంలో బిగించారు. జిల్లాలో చిత్తూరు, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఎస్‌పీఎం కేంద్రాలున్నాయి. వీటి చుట్టు పక్కల నియోజకవర్గాల నుంచి పాడైన ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతు చేసి పంపుతారు. చిత్తూరు కేంద్రంలో ఎక్కువగా కాలిపోయినవి వస్తుంటాయి. ఫిబ్రవరి నెలాఖరు వరకు జిల్లాలో రోజు దాదాపు 20 ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతు చేసి పంపుతున్నారు. మార్చిలో వీటి సంఖ్య మరో పది పెరిగాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఇందులో ఎక్కువగా ఆయిల్‌ మార్పు చేయాల్సినవి వస్తాయి. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కు దాదాపు 50–70 లీటర్ల ఆయిల్‌ను శుద్ధి చేసి వాడుతుంటారు.

ప్రస్తుతం చిత్తూరులో ఉన్న మిషన్‌ రోజు 200 లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తుంది. అంతే పది ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తవడానికి దాదాపు 5 రోజులు సమయం పడుతుంది. ఎండతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులు పెరుగుతుంటాయి. అప్పటికి నూతన ఓఆర్‌ఎం అందుబాటులోకి రాకపోతే ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతుకు రోజుల తరబడి రైతులు వేచి చూడాలి. కొత్త ఓఆర్‌ఎం రోజు 2 వేల లీటర్ల ఆయిల్‌ను శుద్ధి చేస్తుంది. జిల్లాలోని ఎస్‌పీఎంలకు ఇక్కడికి నుంచి ఆయిల్‌ను శుద్ధి చేసి పంపవచ్చు. అలా చేయాలంటే మిషన్‌ను మొదట టెక్నీషియన్లు ఇన్‌స్టాల్‌ (కనెక్షన్‌) ఇవ్వాలి.

ఇబ్బందులు లేకుండా చూస్తాం

టెక్నీషియన్లు బిజీగా ఉండటంతో బిగింపు ఆలస్యమవుతోంది. ఇప్పటికే పలుమార్లు వీటిపై ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ చర్చించారు. టెక్నికల్‌ టీమ్‌తో మాట్లాడుతున్నాం. పది రోజుల్లో వాటిని బిగించి పనులు ప్రారంభించాలని చూస్తున్నాం. వేసవిలో ట్రాన్స్‌ఫార్మర్లు రిపేరుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – వాసుదేవరెడ్డి, ఈఈ ఎంఆర్‌టీ విభాగం

ట్రాన్స్‌‘ఫార్మర్‌’కష్టాలు1
1/1

ట్రాన్స్‌‘ఫార్మర్‌’కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement