కుప్పం : ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో కిండర్ గార్టెన్ యాక్టివిటీ తరగతి గదిని డెన్మార్క్‌కు చెందిన ప్రొఫెసర్ పల్లె జప్సన్ ప్రారంభించారు. శనివారం ఢిల్లీ పబ్లిక్ స్కూలు ప్రాంగణంలో ఐడీపీఎస్ చైర్మన్ దయానిధి ఆధ్వర్యంలో ఈ తరగతి గదిని ప్రారంభించారు. కుప్పంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడం శుభ పరిణామన్నారు. గ్రామీణ ప్రాంతమైన కుప్పంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.అరుల్ రాజ్, మౌళి, జస్టిసన్ ఐఆర్‌ఎమ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.