
బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి పకడ్బందీ చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంగల్రాయనాయుడు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో అండర్ 23 రాష్ట్ర జట్లకు ఎంపికై న క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన రాష్ట్రస్థాయి జట్లు ఈ నెల 18 నుంచి 24 వ తేదీ వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. జాతీయ స్థాయి పోటీలు అసోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహిస్తారన్నారు. రాష్ట్రస్థాయి జట్లల్లో మంచి ప్రతిభ చాటిన 25 మంది పురుషులు, 25 మంది మహిళలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న జట్లకు ఈ నెల 6 నుంచి 14 వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ శిక్షణలో ప్రత్యేక ప్రతిభ చాటిన 12 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను చాటాలన్నారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్‌పీ జయప్రకాష్, కార్యదర్శి సురేష్‌బాబు, కోచ్‌లు నాగరాజు, రుద్ర, బాబు, జాను, రాజేశ్వరి, డీఎస్‌డీవో బాలాజి, పీడీ బాబు తదితరులు పాల్గొన్నారు.
● బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయనాయుడు