క్రియేటివిటీ, నైపుణ్యాలతో ఇంజినీర్లకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

క్రియేటివిటీ, నైపుణ్యాలతో ఇంజినీర్లకు గుర్తింపు

Mar 14 2025 1:54 AM | Updated on Mar 14 2025 1:50 AM

–జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు

నారాయణవనం: క్రియేటివిటీ, నైపుణ్యాలతోనే యువ ఇంజినీర్లకు గుర్తింపు లభిస్తుందని అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ సుదర్శనరావు పేర్కొన్నారు. పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలల 24వ జూబిలేషన్‌ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాల్గొన్నారు. ఓపెన్‌ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం కాకుండా కోడీంగ్‌, డీ–కోడింగ్‌, ప్రాబ్లమ్‌ సొల్యాషన్ల మీద పనిచేయలని, పారిశ్రామిక వేత్తలుగా ఎదనాలని పిలుపునిచ్చారు. సెమీ కండక్టర్‌ టెక్నాలజీ, నిర్మాణ, విద్యాత్‌ రంగాల్లో స్టార్టప్‌ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలని చెప్పారు. కళాశాలల చైర్మన్‌ డాక్టర్‌ అశోకరాజు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, యోగా, ధ్యానంపై దృష్టి పెట్టి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అకడమిక్‌ టాపర్లకు మెడల్స్‌, సర్టిఫికెట్లను అందజేశారు. దక్షిణాది సినీ నటి సంయుక్తా మీనన్‌ ఆటల పాటలతో అలరించారు. యాంకర్‌ భానుశ్రీ తన మాట తీరుతో ఆకట్టుకున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement