విద్యుత్‌ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి

Mar 14 2025 1:54 AM | Updated on Mar 14 2025 1:50 AM

పాలసముద్రం : మండలంలోని తొలికండ్రిగ దళితవాడకు చెందిన వినాయకం(44) గురువారం విద్యుత్‌ షాక్‌ కొట్టి మృతి చెందాడు. వివరాలు ఇలా..మండలంలోని తొలికండ్రిగ దళితవాడకు చెందిన వినాయకం తమిళనాడు పల్లిపట్టులో విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. పల్లిపట్టు పట్టణ పంచాయతీలోని కార్యాలయం ముందు ఉన్న విద్యుత్‌ స్తంభంపై తీగలు మరమ్మతు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్‌ షాక్‌ కొట్టి స్తంభంపై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు పల్లిపట్టు చేరుకుని మృతదేహాన్ని తొలికండ్రిగకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేపట్టారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పశువైద్యశాఖ గ్రామ సహాయకురాలు

ఆత్మహత్యాయత్నం

గుడుపల్లె : మండలంలోని పొగురుపల్లి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న పశువైద్యశాఖ గ్రామ సహాయకురాలు జ్ఞానశ్రీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. పొగురుపల్లి గ్రామంలో ఇటీవల టీడీపీ మండల నాయకుడి బంధువులకు గోకులం షెడ్‌లు ఇవ్వాలని ఆమైపె ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒత్తిడి తాళలేక మనస్తాపానికి గురైంది. దీంతో బుధవారం రాత్రి పురుగు మందు తాగి జ్ఞానశ్రీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం జ్ఞానశ్రీ పీఈఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మండలంలోని టీడీపీ నాయకుల ఒత్తిళ్లే జ్ఞానశ్రీ ఆత్మహత్యాయత్నానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

‘మా కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోంది’

కుప్పంరూరల్‌ : మా కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్సార్‌ సీపీ కుప్పం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సర్దార్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తన నివాసంలో తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. టీడీపీలో చేరాలని ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో షాదీమహల్‌ మరమ్మతులకు చేసిన రూ.21 లక్షలు ఖర్చు చేసినా ఇప్పటి వరకు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. తన కుమార్తె రేష్మాభాను కుప్పం మున్సిపాలిటీలోని మెప్మాలో సంఘమిత్రగా పని చేస్తోందని, ఆమెను తొలగించాలని అనేక రకాలుగా కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తాను గత ఆగస్టులో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా.. కోర్టు ఆదేశాలను దిక్కరించి సీవో జగదీష్‌ అనేక రకాలుగా ఒత్తిళ్లు తెస్తున్నారని వాపోయారు. గ్రూపు సమావేశాల్లో మహిళా సభ్యులంతా ఏకతాటిగా రేష్మాభానునే సంఘమిత్రగా కొనసాగాలని తీర్మానించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తాను ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, తాను అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే నడుస్తానని తెగేసి చెప్పారు. అధికారులు, నాయకులు ఒత్తిళ్లు ఆపకపోతే తగిన రీతితో జవాబు ఇస్తామని హెచ్చరించారు.

విద్యుత్‌ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి 
1
1/1

విద్యుత్‌ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement