వెదురుకుప్పం: కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, యువత దగా పడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మా ట్లాడుతూ పేద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పేదలకు ఉన్నతవిద్య అందని ద్రాక్షగా మిగిలిపోయిందని ఆరోపించారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం బోధన, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశారని కొనియాడారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియంబోధనను రద్దు చేసే దిశగా అడుగు లు వేస్తూ సర్కారు చదువులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు క ల్పిస్తామంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు పది నె లల్లో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించా రు. యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కూటమి నిర్లక్ష్యంపై వైఎస్సార్ సీపీ బుధవారం యువత పోరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ కార్యక్రమానికి తరలివచ్చి, జయప్రదం చేయాలని కోరారు.