తిరుపతి ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొ దటి సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 30న నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
సీజనల్ వ్యాధులు అరికట్టండి
● రాష్ట్ర మలేరియా అడిషనల్ డైరెక్టర్ రామనాథరావు
చిత్తూరురూరల్ (కాణిపాకం): సీజనల్‌గా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించి, కట్ట డికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మలేరియా అడిషనల్ డైరెక్టర్ రామనాథరావు ఆదేశించా రు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉన్న మలేరియా విభాగాన్ని మంగళవారం ఆయన ఆకస్మికగా తనిఖీ చేశారు. మలేరియా కీటక జనిత వ్యాధులపై సమీక్షించారు. దోమల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. మలేరి యా, డెంగీ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఫాగింగ్ చేయించడంతో పాటు వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్, అధికారులు అనిల్‌కుమార్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
ఒంటరి ఏనుగు తమిళనాడుకు మళ్లింపు
గుడిపాల: అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు ఒంటరి ఏనుగును తమిళనాడు వైపునకు మళ్లించారు. గుడిపాల మండలంలో పాగా వేసిన ఒంటరి ఏనుగు జాతీయ రహదారిపైకి రావడంతోపాటు అనుపు గ్రామంలోకి కూడా చొర బడింది. అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరెడ్డి, బీట్ ఆఫీసర్లు ఢిల్లీరాణి, ప్రభాకర్‌రెడ్డి, బీట్ ఆఫీసర్లు జబిల్లా, అరుణతో పాటు సిబ్బంది ఒంటరి ఏనుగు వెళుతున్న వైపు వెళ్లి బాణసంచా కాల్చారు. దీంతో అనుపు గ్రామం, బొమ్మసముద్రం, కనకనేరి గ్రామాల చుట్టుపక్కన పొలాల వైపు వెళ్లిన ఏనుగును తమిళనా డు వైపునకు మళ్లించారు. ఏనుగు తిరిగి వస్తే తమకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు.
ముగ్గురు విద్యార్థుల డిబార్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో తొమ్మిదో రోజు నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు ఇంటర్మీడియట్ డీవీఈఓ సయ్యద్ మౌలా తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాల్‌ప్రాక్టీస్‌కు పా ల్పడిన ముగ్గురు విద్యార్థులు(ఇద్దరు జనరల్ విద్యార్థులు, ఒకరు ఒకేషనల్ విద్యార్థి)ను డిబార్ చేశామన్నారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నిర్వహించిన ప్రథమ సంవత్సరం పరీక్షలో 17,180 మంది విద్యార్థులకుగాను 1,021 మంది గైర్హాజరుకాగా 16,156 మంది హాజరైనట్లు డీవీఈఓ వెల్లడించారు.
ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం