కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు ఓ దాత ఆదివారం నగదు విరాళం అందజేశారు. ఐరాల మండలం తిరుమలయ్యగారి పల్లికి చెందిన మేదరమెట్ల మోహన్ నాయుడు తన కుటుంబ సమేతంగా రూ.లక్ష నగదును విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి దర్శనభాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, తదితరులున్నారు.
అగ్నిప్రమాదంలో
బొలెరో వాహనం దగ్ధం
పుంగనూరు : మండలంలోని మేలుందొడ్డి గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో బొలెరో వాహనం దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. గ్రామానికి చెందిన మహేష్ ఇంటి సమీపంలో జీపును పార్కింగ్ చేసి ఉంచాడు. ఆ ప్రాంతంలో చెత్తా చెదారం ఉండి, ముళ్లపొదలు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు. ఈ మంటల్లో జీపు కాలిపోయింది. విషయం తెలిసిన గ్రామస్తులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
గోసంరక్షణ ట్రస్టుకు రూ.లక్ష విరాళం