
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ షణ్మోహన్
● 298 మందికి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు ● కమిటీ సమావేశంలో కలెక్టర్ షణ్మోహన్
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో జర్నలిస్టులకు ప్రభుత్వం బస్సు పాస్ సౌకర్యం క ల్పించిందని కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో చిత్తూరు జిల్లా అక్రిడిటేషన్ కమి టీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్, కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 ప్రకారం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వివిధ మీడి యా సంస్థల నుంచి అక్రిడిటేషన్‌లకు దరఖాస్తు చేసుకున్న 298 మందికి మొదటి సమావేశంలో మంజూరు చేసినట్లు తెలిపారు. 2023–2024 రెండు సంవత్సరాల కాల పరిమితితో అక్రిడిటేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న జర్నలిస్టులకు, పీరి యాడికల్, వెటరన్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అక్రెడిటేషన్ మంజూరు కాని వారు నిబంధనల మేరకు డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లో మరోసారి సమర్పించిన తర్వా త పరిశీలించి మంజూరు చేస్తామన్నారు. అక్రిడిటేషన్ గడువు ఉండేంత వరకు బస్‌పాస్‌ను ఒకేసారి మంజూరు చేస్తే ఉపయోగంగా ఉంటుందని కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కమిటీ కన్వీనర్, డీఐపీఆర్‌వో పద్మజ, సభ్యులు శివప్రసాద్, ఉమాశంకర్, వెంకటరత్నం, జయరాజ్, శ్రీకాంత్, సురేంద్రరెడ్డి, కార్మిక శాఖ అధికారి ఓంకార్, ఏపీఎస్ ఆర్టీసీ పర్సనల్ ఆఫీసర్ సెహజాన్, గృహ నిర్మాణ శాఖ మేనేజర్ దొడ్డప్ప, ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌వో రాజశేఖర్‌రెడ్డి, ఏపీవో వెంకటరమణ పాల్గొన్నారు.