యాదమరి(పూతలపట్టు): పూతలపట్టు..... | - | Sakshi
Sakshi News home page

యాదమరి(పూతలపట్టు): పూతలపట్టు.....

Jun 3 2023 1:36 AM | Updated on Jun 3 2023 1:36 AM

170 గొల్లపల్లెలో తాళాలు వేసిన టీడీడీ మద్దతుదారుల ఇళ్లు
 - Sakshi

170 గొల్లపల్లెలో తాళాలు వేసిన టీడీడీ మద్దతుదారుల ఇళ్లు

యాదమరి(పూతలపట్టు): పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంఎస్‌బాబుకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి టీడీపీ శ్రేణులు తట్టుకోలేక పోతున్నాయి. నియోజకవర్గంలో 60 వేలకుపైగా కుటుంబాలు ఉన్నాయి. గతనాలుగేళ్ల కాలంలో 50 వేల కుటుంబాలకుపైగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. జనం సమస్య తీర్చడానికి సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రజల వద్దకు వెళుతున్నారు. ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రజల నుంచి ప్రభుత్వం భేష్‌ అనే ముద్రను వేసుకుంది. ప్రభుత్వ పథకాల అమలుపై టీడీపీ సానుభూతిపరులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది తట్టుకోలేక పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో నాయకులు కుట్రలకు తెరతీశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు ప్రజలను భయపెడుతూ.. మేం చెప్పిందే చేయాలని నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. గడపగడపకు వస్తే ఇంటికి తాళం వేసి వెళ్లి పోవాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ పాలన నచ్చక ప్రజలే స్వచ్ఛదంగా ఇంటికి తాళం వేస్తున్నట్లు పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తోంది. కుల రాజకీయాలకు ఆజ్యం పోయిస్తున్నారు. అక్కడి టీడీపీ ఘోరాలను గడపగడపకు కార్యక్రమం ముగిసిన అనంతరం ఎమ్మెల్యే వద్ద పలువురు పేదలు వివరిస్తున్నారు. పూతలపట్టు మండలం పేట ఆగ్రహారం గ్రామంలో దళిత ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమంలో టీడీపీ నేత లు ఇళ్లకు తాళాలు వేశారు. అనంతరం వీధులను పసుపు నీళ్లతో కడిగారు. బంగారుపాళ్యం మండలం 170 గొల్లపల్లెలో కూడా టీడీపీ శ్రేణులు ఇళ్లకు తాళాలు వేయాలని హుకుం జారీ చేసి, ఆమేరకు తాళాలు వేయించారు. ఈ ఘటనలపై సర్వత్రా నిరసన వ్యక్తం అయ్యింది. మరిన్ని గ్రామాల్లో కూడా గడపగడప కార్యక్రమాన్ని అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నట్లు ఆయా గ్రామస్తుల సమాచారం.

సామన్య ప్రజలపై టీడీపీ జులుం

ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం

గడపగడపకు వస్తే ఊర్లో

ఉండకూడదని హుకుం

కుల రాజకీయాలకు ఆజ్యం

మండిపడుతున్న గ్రామీణ జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement