జిల్లాలో ఎక్కువగా సాగవుతున్న తోతాపురి రకం మామిడి కోతలు ఈనెల తొలివారం నుంచి మొదలు కానున్నాయి. ఇప్పటికే కొన్ని మామిడి పల్ఫ్ ఫ్యాక్టరీలు రైతులతో అగ్రిమెంట్లు చేసుకుని డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తుండగా.. మరికొన్ని ఫ్యాక్టరీలు ఏజెంట్లు, వ్యాపారుల ద్వారా మామిడిని ర్యాంపుల నుంచి కొనుగోలు చేయనున్నాయి. ఈదఫా ఉమ్మడి జిల్లాలో జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలతో మామిడి రైతులకు గిట్టుబాటు లభిస్తోంది. ప్రైవేటు ర్యాంపుల వద్ద తూకాల్లో మోసాలు జరక్కుండా హార్టికల్చర్ అసిస్టెంట్ల పర్యవేక్షణతో అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ప్రధాన మామిడి మార్కెట్లలో కొనుగోళ్లు మొదలైయ్యాయి. మామిడి గుజ్జు తయారీకి ఫ్యాక్టరీలు సన్నద్ధమవుతున్నాయి.