నితిన్‌గడ్కరీకి ప్రతిపాదన అందిస్తున్న ఎంపీ రెడ్డెప్ప
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రహదారుల అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ రెడ్డెప్ప ప్రతిపాదన అందజేశారు. బుధవారం ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ చిత్తూరులో కట్టమంచి నుంచి పుత్తూరు రోడ్డును సుమారు 2.5 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తే నగరంలో చాలావరకు ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. అలాగే సంతపేట నుంచి కై లాసపురం మీదుగా చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారి వరకు మొత్తం మూడు కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయాలని కోరామని చెప్పారు. అలాగే జిల్లాలో మరికొన్ని రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలను అందించామని, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.


